IND Vs PAK : ఆసియా కప్ 2025 మరికొద్ది గంటల్లోనే చివరి అంకానికి చేరుకోనుంది. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా షేక్ హ్యాండ్ వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007 నుంచి తాను క్రికెట్ ఆడుతున్నానని.. కానీ రెండు జట్లు షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం పై ఇప్పటి వరకు చూడలేదని తెలిపాడు. భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఉన్న దానికంటే దారుణ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగాయని.. అప్పుడు షేక్ హ్యాండ్ చేసుకున్నారు.
Also Read : Asia Cup 2025 : టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవరు..చిలుక జోష్యం ఇదే
కానీ ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. ఇది క్రికెట్ కి ఏ మాత్రం మంచిది కాదని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం తరువాత టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు “షేక్ హ్యాండ్” ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డోర్ చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే విషయాన్ని మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మరోవైపు ఈ విజయాన్ని సాయుధ బలగాలకకు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు టీమిండియా అండగా ఉంటుందని.. సంఘీభావం తెలిపాడు. అయితే ఈ ప్రకటనతో సూర్యకుమార్ యాదవ్ కి మ్యాచ్ లో 30 శాతం ఫీజు కోత పడింది. ఇక ఈ వ్యవహారం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసి.. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావించి ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన పై ఐసీసీ పెద్దగా స్పందించలేదు. ఇక ఆ తరువాత సూపర్ 4లో కూడా ఇరు జట్లు మరోసారి తలపడగా.. మళ్లీ భారత్ విజయం సాధించింది. అప్పుడు కూడా పాకిస్తాన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత్. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీమిండియాను సెప్టెంబర్ 28 ఆదివారం జరిగే ఫైనల్ లో ఓడించి ఇంటికి పంపిస్తామని.. ఆటగాళ్లపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పై వాడు మనిషి కాదు.. ఓ జంతువు అని షోయబ్ అక్తర్ సెన్షేషన్ కామెంట్స్ చేశారు. మరోవైపు షాహిది అఫ్రిది సైతం ఫైనల్ లో తమ అల్లుడు షాహీన్ అఫ్రిది 5 వికెట్లను తీస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోతాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పేర్కొనడం గమనార్హం. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని.. ఒకవేళ మీరు అన్నట్టు అభిషేక్ శర్మ కనుక త్వరగా ఔట్ అయితే.. సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు ఉన్నారు. టీమిండియా విజయం సాధించడం పక్కా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు టీమిండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు.
Indian journalist, How have things changed within the Pakistan team after the 14 Sep match?
Salman Ali Agha: "I have been playing cricket since 2007-08, but I have never seen any team refuse to shake hands. Even in India-Pakistan matches, when the situations were much worse,… pic.twitter.com/jCuqybOak2
— Sheri. (@CallMeSheri1_) September 27, 2025