Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రమంత అల్లకల్లోలంగా మారింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. హైదరాబాద్‌లో మూసినది భారీగా ప్రవహిస్తుంది. దీంతో మూసినది పరివాహక ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. నాన్‌స్టాప్‌గా వర్షాలు కురవడంతో వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు, అనేక పనుల కారణంగా బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణాకు వాణ ముప్పు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, మెదక్, జగిత్యాల, సిరిసిల్లా, నిజామాబాద్ , నారాయణపేట, జనగాం, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో వాయుగుండం ప్రభావం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
అల్పపీడనం కారణంగా.. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల మరో రెండు రోజులు పాటు ఏపీ వ్యాప్తంగా పలు చోట్లు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు ఈనెల 29 వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
జాగ్రత్తలు..
ఇక, రాజధాని హైదరాబాద్ మహా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల పాటు సిటీ వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలు, వరద పరిస్థితులను, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తుండాలని ఆదేశించారు.