Free Galaxy Watch 8| శామ్‌సంగ్ ఇటీవల లాంచ్ చేసిన స్మార్ట్‌వాచ్ గెలాక్సీ వాచ్ 8ని ఉచితంగా పొందవచ్చు. అయితే దీని కోసం ఒక చిన్న పోటీలో పాల్గొనాలి. త్వరలో జరగబోతున్న ఇండియా వరల్డ్ హార్ట్ డే ముందు వాక్-అ-థాన్ ఇండియా చాలెంజ్‌ల ఫోర్త్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ వాకథాన్ లో పాల్గొనేవారు నడక చేస్తూ పెద్ద బహుమతులు గెలవవచ్చు. చాలెంజ్ సెప్టెంబర్ 29, 2025న మొదలవుతుంది. అక్టోబర్ 28, 2025 వరకు జరుగుతుంది.
30 రోజుల్లో 200,000 స్టెప్స్ పూర్తి చేయాలి. అందరూ పూర్తి చేస్తే బహుమతులు దక్కుతాయి. మూడు లకీ విన్నర్లు గెలాక్సీ వాచ్ 8 (విలువ ₹44,000) గెలుస్తారు. మిగిలినవారికి గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌పై ₹15,000 వరకు డిస్కౌంట్ కూపన్లు ఇస్తారు. ఫిట్‌నెస్ తో పాటు ఫన్ కావాలంటే కోసం ఇప్పుడే పాల్గొనండి!
చాలెంజ్‌లో పాల్గొనే విధానం
గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లో శామ్‌సంగ్ హెల్త్ యాప్ ఉపయోగించాలి. ఇన్‌స్టాల్ చేసి, యాప్‌లో వాక్-అ-థాన్ ఇండియా కోసం రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే స్టెప్స్ కౌంట్ అవుతాయి. ఫ్రెండ్స్ లీడర్‌బోర్డ్‌తో రియల్-టైమ్‌లో ప్రోగ్రెస్ ట్రాక్ చేయవచ్చు. ఇది మోటివేషన్‌ను పెంచుతుంది. చాలెంజ్ పూర్తి చేసిన తర్వాత శామ్‌సంగ్ మెంబర్స్ యాప్‌లో రివార్డ్ క్లెయిం చేయండి. స్క్రీన్‌షాట్ తీసి #WalkathonIndia హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయండి. ఇది గెలిచే అవకాశాన్ని పెంచుతుంది. అందరికీ ప్రైజులు గెలిచే చాన్స్ ఉంది.
ఇండియాలో గెలాక్సీ వాచ్ 8 ధరలు
గెలాక్సీ వాచ్ 8 40mm బ్లూటూత్ మోడల్ ధర ₹30,999. 44mm బ్లూటూత్ వెర్షన్ ₹35,999. LTE కనెక్టివిటీకి అదనపు ఖర్చు. టాప్ మోడల్ 46mm LTE ₹44,999. శామ్‌సంగ్ స్టోర్లు లేదా ఆన్‌లైన్ రిటైలర్లలో లభిస్తాయి. సేల్స్ సమయంలో ఆఫర్లు ఉంటాయి. చాలెంజ్ సమయంలో శామ్‌సంగ్ మరిన్ని డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది.
వాచ్ 8 ముఖ్య ఫీచర్లు
గెలాక్సీ వాచ్ 8లో సూపర్ AMOLED స్క్రీన్ ఉంది. రెండు వేరియంట్ సైజులు 1.34-ఇంచ్ లేదా 1.47-ఇంచ్ లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. బ్రైట్‌నెస్ 3,000 నిట్స్, అన్ని సిట్యువేషన్లలో క్లియర్ వ్యూ అందిస్తుంది. దీనిపై ఉన్న సఫైర్ క్రిస్టల్ గ్లాస్ చాలా బలమైనది. ఎక్సినాస్ W1000 ప్రాసెసర్‌తో స్మూత్ ఆపరేషన్స్. 2GB RAM, 32GB స్టోరేజ్. బ్యాటరీ సైజ్ ప్రకారం మారుతుంది. 40mmలో 325mAh, 44mmలో 435mAh బ్యాటరీ ఉంది.
వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ WPCతో సపోర్ట్ చేస్తుంది. వేర్ OS 6, వన్ UI 8 వాచ్‌పై రన్ అవుతుంది. బయోయాక్టివ్ సెన్సార్ హెల్త్ ట్రాకింగ్‌కు కచ్చితంగా చూపిస్తుంది. ఇది ఆప్టికల్ సిగ్నల్స్, హార్ట్ రిథమ్ కొలుస్తూ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో సూచిస్తుంది. బయోఎలక్ట్రికల్ అనాలిసిస్, టెంపరేచర్ వేరియేషన్స్ ట్రాక్ చేస్తుంది.
యాక్సిలరోమీటర్ మూవ్‌మెంట్స్, బారోమీటర్ ఎలటిట్యూడ్, గైరోస్కోప్ నావిగేషన్, జియోమాగ్నెటిక్ సెన్సార్ పొజిషన్, అంబియంట్ లైట్ సెన్సార్ ఆటో బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేస్తాయి.
కనెక్టివిటీ
LTE, బ్లూటూత్ 5.3 ఆప్షన్లు. వై-ఫై, NFC క్విక్ లింక్స్. డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS కచ్చితమైన మ్యాపింగ్. 5ATM + IP68 వాటర్ రెసిస్టెన్స్. బరువు 30g లేదా 34g, రోజంతా కంఫర్టబుల్‌గా ధరించవచ్చు. అయితే GPS రోజంతా ఆన్ చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.
శాంసంగ్ ప్రకటించిన హెల్తీ ప్రొగ్రామ్.. దేశంలో ఆరోగ్యాన్ని ప్రొమోట్ చేసేందుకు. వాకథాన్ లో ఇప్పటికే వేలాది మంది పాల్గొంటున్నారు. మీరూ పాల్గొనండి.. లయద రివార్డులు పాల్గొనండి.
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!