NEP-WI : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. రోజు రోజుకు ఏ జట్టు ఎప్పుడూ పుంజుకుంటుందో గుర్తించలేకపోతున్నాం. ఎవ్వరిలో ఎప్పుడూ టాలెంట్ ఉంటుందో చెప్పలేదు. ఇటీవల ఆసియా కప్ 2025లో ఒమన్ జట్టు.. టీమిండియా, పాకిస్తాన్ జట్లకు ముచ్చెమటలు పట్టించింది. తాజాగా నేపాల్ క్రికెట్ జట్టు వెస్టిండీస్ కి చుక్కలు చూపించింది. నేపాల్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో వెస్టిండిస్ ను ఓడించింది నేపాల్ టీమ్. ఈ మ్యాచ్ లో నేపాల్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 148 పరుగులు చేసింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నేపాల్ జట్టు 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నేపాల్ క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. షార్జా వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ లో వెస్టిండీస్ ను 19 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఐసీసీలో టెస్ట్ హోదా కలిగిన జట్టు పై తొలిసారిగా విజయం సాధించి రికార్డుల్లోకెక్కింది. 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా శనివారం ఇరు జట్లు తొలి మ్యాచ్ లో తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్టకష్టాలు పడిన విండిస్ జట్టు.. నేపాల్ బౌలర్లను ఎదుర్కోలేక కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో కరీబీయన్ జట్టు పై హిమాలయ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తేడాతో ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతోంది. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఆల్ రౌండ్ షో తో అదురగొట్టాడు. 35 బంతుల్లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అలాగే 3 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఛేజింగ్ లో నేపాల్ కి వెస్టిండీస్ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండో ఓవర్ లోనే 5 పరుగుల వద్ద ఓపెనర్ కైల్ మేయర్స్ వికెట్ కోల్పోయిన విండీస్ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. వరసగా వికెట్లు కోల్పోతూ ప్రత్యర్థికి మ్యాచ్ ను సమర్పించుకుంది వెస్టిండీస్ జట్టు. ఇక ఈ విజయాన్ని ఇటీవల జెడ్ జెడ్ ఆందోళనల్లో మరణించిన వారికి అంకితమిస్తున్నట్టు నేపాల్ కెప్టెన్ పౌడేల్ ప్రకటించాడు. దీంతో నేపాల్ జట్టు పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక చిన్న దేశం వెస్టిండిస్ జట్టు లాంటి బలమైన జట్టును ఓడించడం మామూలు విషయం కాదని అభినందిస్తున్నారు.