E-Paper
Advertisement

వన్‌ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్‌ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?

వన్‌ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్‌ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?
Advertisement

OnePlus Exit: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని రారాజుగా వెలిగిన ‘వన్‌ప్లస్’ (OnePlus) బ్రాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి వన్‌ప్లస్ పూర్తిగా వైదొలగడానికి సిద్ధమైవుతున్నట్లు సమాచారం. దీంతో పాటు దాని సోదర సంస్థ అయిన ‘రియల్‌మీ’ (Realme) కూడా గ్లోబల్ మార్కెట్ నుండి నిష్క్రమించనుందని టాక్. మాతృసంస్థ అయిన ‘ఒప్పో’ (Oppo) చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ (Restructuring) చర్యల్లో భాగంగానే ఈ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

వెనకడుగుకు ప్రధాన కారణాలివే..

ఈ ఊహించని నిర్ణయానికి పలు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గడం, విడిభాగాల ధరలు పెరగడం వల్ల వన్‌ప్లస్ లాభాలపై తీవ్ర ప్రభావం పడింది. వీటికి తోడు చైనా సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా, యూరప్‌లలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. వ్యాపారాన్ని మరింత క్లిష్టం చేశాయి. అదే సమయంలో యాపిల్ సంస్థ ఒన్‌ప్లస్‌పై వేసిన ‘ట్రేడ్ సీక్రెట్స్’ కేసు కూడా కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది.

వన్‌ప్లస్ స్థానంపై వాటి కన్ను!

Advertisement

అయితే తక్కువ ధరకే యాపిల్, శాంసంగ్‌ స్థాయి ప్రీమియం ఫీచర్లను అందిస్తూ వన్‌ప్లస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఓ దశలో టెక్ దిగ్గజాలకు సైతం సవాలు విసిరిన ఈ బ్రాండ్.. నేడు కార్పొరేట్ ఒత్తిళ్ల వల్ల ఇలా వెనక్కి తగ్గడం ఆశ్చర్యమేనని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్, మోటోరోలా వంటి బ్రాండ్లు వన్‌ప్లస్ స్థానాన్ని భర్తీ చేయడానికి వేగంగా దూసుకొచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.

భారత్‌లో వన్‌ప్లస్ పరిస్థితేంటి?

ప్రస్తుతానికి వన్‌ప్లస్ సేవలు కొనసాగినప్పటికీ.. త్వరలోనే దాని ఎగ్జిట్ ప్రక్రియ మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌కు అత్యంత కీలకమైన మార్కెట్ గా ఉన్న భారతదేశంలో కూడా 2027 నాటికి ఈ బ్రాండ్ నిష్క్రమించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే ఈ ప్రచారాన్ని వన్ ప్లస్ ఇండియా ఖండించింది. భారత్ లో తమ వ్యాపారం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే 2027 తర్వాత కూడా కార్యాకలాపాలు కొనసాగుతాయా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: అదృష్టమంటే ఇతనిదే.. దుబాయ్ లాటరీలో హైదరాబాదీకి రూ. 9.62 కోట్లు!

ఒప్పో సరికొత్త వ్యూహం

అయితే వన్ ప్లస్ మాతృ సంస్థ ఒప్పో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటూ నష్టపోవడం కంటే లాభాలు వచ్చే పరిమిత మార్కెట్లపైనే దృష్టి పెట్టాలని ఒప్పో నిర్ణయించినట్లు టాక్. ఇందులో భాగంగా ఒప్పో ఇకపై సెంట్రల్ యూరప్‌పై దృష్టి పెట్టనుండగా.. తన మరో సబ్ బ్రాండ్ రియల్‌మీ ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ వంటి నార్డిక్ దేశాలకు మాత్రమే పరిమితం కానుంది.  వన్ ప్లస్ ను మాత్రం చైనాకే పరిమితం చేసే యోచనలో ఒప్పో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా వన్‌ప్లస్ నిష్క్రమణ వార్త మొబైల్ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని చెప్పవచ్చు.

Also Read: బాత్రూమ్‌లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!

Related News

బడ్జెట్ ధరలో అదిరిపోయే సౌండ్.. టాప్ 5 మివి ఇయర్‌బడ్స్ ఇవే!

యాపిల్ iPad Mini లవర్స్‌కు భారీ షాక్.. ఆ ఒక్క ఫీచర్ తీసేసి పెద్ద తప్పు చేశారా?

అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై స్పీడ్ పెంచవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!

బాత్రూమ్‌లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!

ఆకలితో కాదు.. మొసళ్లు రాళ్లను మింగడం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? అసలు కారణం ఇదే!

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!

కొత్త వస్తువులే.. కొండంత డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో ‘క్లియరెన్స్’ జాతర!

Big Stories

Advertisement
×