E-Paper
Advertisement

బాత్రూమ్‌లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!

బాత్రూమ్‌లోకి వెళ్తే చాలు.. అంతా అదే చూసుకుంటుంది.. షావోమీ అద్భుత స్మార్ట్ హీటర్ లాంచ్!
Advertisement

Mijia Smart Bathroom Heater: ఇంటిని స్మార్ట్‌గా మార్చే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) మరో అద్భుతమైన హోమ్ అప్లయన్స్ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వర్షాకాలం, చలికాలంలో బాత్రూమ్‌ను వెచ్చగా మార్చేందుకు గాలిని తాజాగా ఉంచేందుకు వీలుగా ‘మిజియా స్మార్ట్ బాత్రూమ్ హీటర్ P1 హ్యూమన్ సెన్సింగ్ ఎడిషన్’ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ బాత్రూమ్ హీటర్ కేవలం వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా.. మనుషుల కదలికలను గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే సరికొత్త ఫీచర్లతో రూపొందింది.

హ్యూమన్ సెన్సింగ్ టెక్నాలజీ

ఈ కొత్త ఎడిషన్ ప్రత్యేకత దీని ‘హ్యూమన్ సెన్సింగ్’ (Human Sensing) సాంకేతికతలోనే దాగుంది. దీనిలో లైటింగ్, హీటింగ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఉన్నాయి. బాత్రూమ్‌లోకి ఎవరైనా ప్రవేశించగానే ఇందులోని మోషన్ సెన్సార్లు వెంటనే గుర్తించి యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే లైటింగ్, హీటింగ్, ఎయిర్‌ఫ్లో (గాలి ప్రసరణ) సిస్టమ్‌లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. అలాగే బాత్రూమ్ నుండి బయటకు వెళ్లిన తర్వాత నిర్దేశిత సమయంలో ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

శక్తివంతమైన హీటింగ్

Advertisement

ఈ స్మార్ట్ హీటర్ కేవలం కొన్ని సెకన్లలోనే బాత్రూమ్ మొత్తాన్ని వెచ్చగా మార్చగలదని షావోమీ వర్గాలు తెలిపాయి. ఇందులో అమర్చిన శక్తివంతమైన డ్యూయల్-కోర్ మోటార్, పిటిసి (PTC) హీటింగ్ ఎలిమెంట్స్ ద్వారా వేడి గాలి వేగంగా గది అంతా వ్యాపిస్తుందని పేర్కొన్నాయి. కేవలం చలిని తరిమికొట్టడమే కాకుండా బాత్రూమ్‌లో తేమ శాతం పెరిగిపోకుండా డీహ్యూమిడిఫికేషన్ (Dehumidification) కూడా ఇది చేయనుంది. దీనివల్ల బాత్రూమ్ గోడలు, అద్దాలపై తేమ పేరుకుపోకుండా పొడిగా ఎల్లప్పుడు పొడిగా ఉంటాయి.

వెంటిలేషన్, దుర్వాసనకు చెక్

బాత్రూమ్‌లలోని దుర్వాసనను దూరం చేయడానికి ఈ పరికరంలో ప్రత్యేక వెంటిలేషన్ మోడ్స్ ఉన్నాయి. ఇది బాత్రూమ్‌లోని చెడు గాలిని బయటకు పంపి, తాజా గాలి లోపలికి వచ్చేలా చేస్తుంది. దీనిలోని ‘డ్రైయింగ్’ మోడ్ ను ఉపయోగించి.. వర్షాకాలంలోనూ బాత్రూమ్ పొడిగా ఉంచుకోవచ్చు.

స్మార్ట్ కనెక్టివిటీ

Advertisement

షావోమీ మిజియా బ్రాండ్ ప్రొడక్ట్ కావడంతో ఇది కంపెనీకి చెందిన ‘హైపర్ ఓఎస్’ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ‘మిజియా యాప్’ ద్వారా బాత్రూమ్ ఉష్ణోగ్రతను, లైటింగ్ బ్రైట్‌నెస్‌ను ఎక్కడి నుంచైనా సులువుగా సెట్ చేయవచ్చు. అంతేకాకుండా, షావోమీ వాయిస్ అసిస్టెంట్ ‘Xiao AI’ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

Also Read: ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!

ఇంతకీ ధర ఎంతంటే?

మిజియా స్మార్ట్ బాత్రూమ్ హీటర్ ధరను షావోమీ 999 యువాన్లుగా నిర్ణయించింది. ఇది త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఆ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనాలో నిర్ణయించిన ధర (999 యువాన్లు)ను బట్టి చూస్తే భారత్ లో దీని ధర సుమారు రూ.14,205 గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ స్మార్ట్ బాత్రూమ్ హీటర్.. వృద్దులు, పిల్లలు ఉన్న ఇళ్లకు ఎంతో రక్షణను, సౌకర్యాన్ని అందిస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: కొత్త వస్తువులే.. కొండంత డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో ‘క్లియరెన్స్’ జాతర!

Related News

అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై స్పీడ్ పెంచవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది!

ఆకలితో కాదు.. మొసళ్లు రాళ్లను మింగడం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? అసలు కారణం ఇదే!

బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!

కొత్త వస్తువులే.. కొండంత డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో ‘క్లియరెన్స్’ జాతర!

ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!

కేవలం రూ. 411 కే బ్లూటూత్ ఇయర్‌బడ్స్.. డోంట్ మిస్

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే.. 50 ఇంచుల టీవీ రూ. 27వేలకే !

Big Stories

Advertisement
×