Jio AirFiber plans : ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ ను తీసుకొస్తున్న జియో తాజాగా మరో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 600 కంటే తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ తో హై స్పీడ్ ఇంటర్నెట్, 12 OTT ప్లాట్‌ఫారమ్స్, 800కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ను ఉచితంగా అందిస్తుంది.
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం అదిరిపోయే లేటెస్ట్ ప్లాన్స్ ను తీసుకొస్తుంది. మొబైల్ కు సంబంధించి రీఛార్జ్ ప్లాన్స్ తో పాటు హై స్పీడ్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ను సైతం అందిస్తుంది. అయితే ఎయిర్ ఫైబర్ లో ఇప్పటికే జియో నుంచి బెస్ట్ ఆఫర్స్ ఉండగా తాజాగా మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంటికోసం హై స్పీడ్ WiFi కనెక్షన్‌ని పొందాలనుంకుంటే తాజాగా జియో తీసుకొచ్చిన JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ బెస్ట్ ఆఫ్షన్. ఈ ప్లాన్లో Jio రూ. 600 కంటే తక్కువ ధరకే JioFiber ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో ముందెన్నడూ లేని బెస్ట్ ఆఫర్స్ ను జియో తీసుకొచ్చింది. ఇక హై స్పీడ్ ఇంటర్నెట్, 12 OTT సబ్స్క్రిప్షన్, 800 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను ఉచితంగా అందిస్తుంది. ఈ లైవ్ టీవీ ఛానెల్స్ ను యాక్సెస్ చేయడానికి జియో సెటప్ బాక్స్‌ను కూడా అందిస్తుంది. జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో పూర్తి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవం మాత్రం ఖచ్చింతంగా దొరుకుతుంది.
డేటా –
జియో రూ.599 ఎయిర్ ఫైబర్ ప్లాన్ ఇప్పటివరకూ ఉన్న ప్లాన్స్ లో చౌకైనది మాత్రమే కాదు బెస్ట్ ప్లాన్ కూడా. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇక ఈ ప్లాన్‌ను 6 నెలలు, 12 నెలలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ 1000GB డేటాను అందిస్తుంది. అది కూడా గరిష్టంగా 30Mbps వేగంతో వస్తుంది.
DTH ప్రయోజనాలు –
డేటాతో పాటు ఈ ప్లాన్ లో DTH ప్రయోజనాలు బెస్ట్ గానే ఉన్నాయి. ఈ ప్లాన్‌లో 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర రోజు వారీగా లెక్కేస్తే కేవలం రూ. 20 మాత్రమే. ఈ ప్లాన్‌లో సెటప్ బాక్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ బాక్స్ తో టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు. ఇక 12 నెలల పాటు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే యూజర్స్ కు జియో ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను అందజేస్తుంది.
OTT ప్లాట్‌ఫారమ్స్ –
ఇక మూవీ లవర్స్ కు ఈ ప్లాన్ బెస్ట్ ఆఫ్షన్. OTT ప్లాట్‌ఫారమ్స్ చూడటానికి ఇష్టపడే యూజర్స్ కు ఈ ప్లాన్‌లో 15 OTT సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ OTT సబ్స్క్రిప్షన్స్ లో Disney + Hotstar, Sony Liv, ZEE5, JioCinema, Sun NXT, Hoichoi, Discovery +, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, DocuBay తో పాటు EPIC ON వంటి పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ఉన్నాయి.
ALSO READ : వావ్.. రూ. 599కే హై స్పీడ్ ఇంటర్నెట్, 12 OTT ప్లాట్‌ఫారమ్స్, 800కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్