BigTV English

Moto New Phone: వాసివాడి తస్సాదియ్య.. మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక..!

Moto New Phone: వాసివాడి తస్సాదియ్య.. మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక..!

Moto G45 5G: మోటో బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పటికే చాలా మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసిన కంపెనీ త్వరలో మరోక బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ Moto G45 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారతదేశంలో ప్రారంభించనుంది. కంపెనీ తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ తేదీని వెల్లడించింది.


అలాగే ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్ ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్‌లను బయటపెట్టింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షనాలను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. కాగా ఈ Moto G45 5G ఫోన్ ఈ ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబడిన Moto G34 5G అప్‌డేటెడ్ వెర్షన్‌గా వస్తున్నట్లు భావిస్తున్నారు.

Also Read: మెస్మరైజింగ్ ఆఫర్స్.. సామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఊహించలేనంత..!


Moto G45 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ వెల్లడించింది. మైక్రోసైట్‌లో వెల్లడించిన డిజైన్ ప్రకారం.. ఈ ఫోన్‌ వేగన్ లెథర్ ఫినిష్‌తో మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అవి బ్లూ, గ్రీన్, మెజెంటా ఆప్షన్‌లు. అలాగే Moto G45 5G వెనుక కెమెరా LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. అలాగే నిలువుగా అమర్చబడిన రెండు వేర్వేరు, సర్క్యూలర్ కెమెరా స్లాట్‌లతో కనిపిస్తుంది. కుడి అంచు పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది. దిగువ అంచు USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తుంది. Moto G45 5G ఫోన్ స్లిమ్ బెజెల్స్‌తో కొంచెం మందంగా ఫ్లాట్ డిస్‌ప్లేతో కనిపిస్తుంది. హ్యాండ్‌సెట్ ఎడమ అంచు SIM ట్రే స్లాట్‌తో కనిపిస్తుంది.

Moto G45 5G Features

Moto G45 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సేఫ్టీతో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 SoC ద్వారా అందించబడుతుంది. ఇది 8GB RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నట్లు నిర్ధారించబడింది. కాగా ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయిన తర్వాత ఇతర RAM, స్టోరేజ్ వేరియంట్‌లలో అందించే అవకాశం ఉంది. ఇక Moto G45 5G ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను పొందుతుంది. Motorola Smart Connect ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. Moto G45 5G ఫోన్ 4GB RAM గల వేరియంట్ 16MP సెల్ఫీ కెమెరా, 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక దీని ధర విషయానికొస్తే.. భారతదేశంలో దీని ధర దాదాపు రూ.15,000 ($180/€160) ఉంటుంది చెప్పబడింది.

Related News

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Big Stories

×