BigTV English
Advertisement

Motorola razr 50: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Motorola razr 50: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Motorola razr 50 discount: మోటో ఫోన్లను మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. కంపెనీ కూడా కొత్త కొత్త ఎక్స్‌పెర్‌మెంట్స్ చేస్తూ బడ్జెట్ ధర నుండి ప్రీమియం ధర వరకు ప్రతి సిగ్మెంట్‌లో మొబైల్స్ లాంచ్ చేస్తుంది. అంతేకాకుండా ఫోల్డ‌బుల్ ఫోన్లను సైతం రిలీజ్ చేసి అదరగొట్టేస్తుంది. అయితే ఫోల్డబుల్ ఫోన్లు సాధారణంగా అధిక ధరను కలిగి ఉంటాయి. అందువల్ల అలాంటి ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారు తమ కోరికను చంపుకుంటారు. మరి మీరు కూడా ఒక మంచి ఫోల్డ‌బుల్‌ ఫోన్‌ని కొనుక్కోవాలని చూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం.


ఎందుకంటే ఇప్పుడు Motorola razr 50 ఫోల్డబుల్ ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో పాటు కళ్లు చెదిరే బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. ఈ ఫోన్ మొదటి సేల్ ఇవాళ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో Motorola razr 50 ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Motorola Razr 50 Specifications


Motorola Razr 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.9-అంగుళాల pOLED FHD+ AMOLED మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ టెక్నాలజీ, 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా 3.63 అంగుళాల OLED FHD+ AMOLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, HDR10 టెక్నాలజీ, 1700 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో MediaTek Dimension 7300X ప్రాసెసర్ అందించబడింది.

Also Read: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

ఈ ఫోన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది. ఈ Motorola ఫోన్ 8GB RAM + 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీనికి శక్తినివ్వడానికి కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4200mAh బ్యాటరీని అందించింది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఇది IPX8 రేటింగ్‌ను పొందింది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Motorola razr 50 Price, Offers

Motorola razr 50 అసలు ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఫస్ట్ సేల్‌లో భాగంగా దాదాపు రూ.5,000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అయితే ఇది మాత్రమేనా అనుకుంటున్నారా? దీంతో పాటు మరో బిగ్గెస్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు ఈ ఫోన్‌ను యాక్సిస్, ఐడిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.10,000 తక్షణ తగ్గింపును పొందుతారు. ఈ తగ్గింపులతో Motorola razr 50 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ నుండి ఆర్డర్ చేయవచ్చు. ఇది స్ప్రిట్జ్ ఆరెంజెమ్, బీచ్ సాండ్, కోలా గ్రేలో అందుబాటులోకి వచ్చింది.

Related News

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Big Stories

×