BigTV English

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Poco F6 5G Price : ఎన్నో ప్రొడక్టులను అతి తక్కువ ధరలో అందించే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరికొన్నింటిపై ఊహించని తగ్గింపులను అందించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే త్వరలో ఓ కొత్త సేల్‌ను తీసుకురానుంది. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్ 2024’ (Flipkart Big Billion Days Sale 2024) ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే అంతకంటే ముందుకు ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ సెప్టెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ సేల్‌ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ తదితర ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది.


అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరలో ఒక మంచి ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో ఎన్నో మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. అందులో పోకో ఒకటి. ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న Poco F6 5G పై ఫ్లిప్‌కార్ట్ కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ గతంలో లాంచ్ సమయంలో దాదాపు రూ.29,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువకు కొనుక్కోవచ్చు.

సెప్టెంబర్ 27న అందుబాటులోకి రాబోతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో Poco F6 5Gని రూ.8,000 తగ్గింపుతో కేవలం రూ.21,999లకి కొనుక్కోవచ్చు. ఒక ఫోన్‌పై ఇంతటి భారీ డిస్కౌంట్ లభించడం అద్భుతమనే చెప్పాలి. అందువల్ల ఒక మంచి గేమింగ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.


Poco F6 5G Specifications

Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Poco F6 5G స్మార్ట్‌ఫోన్ పెద్ద 6.67 అంగుళాల AMOLED పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, సన్నని బెజెల్స్‌తో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. అలాగే HDR10+ మద్దతు, 2400 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌ని కూడా కలిగి ఉంది. గేమింగ్ కోసం చాలా బాగుంది.

Poco F6 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్, హై-గ్రాఫిక్స్ గేమింగ్ వంటి పనులను చాలా స్పీడ్‌గా చేయగలదు. అలాగే Poco F6 5G ఫోన్‌లో 90fps వద్ద BGMI వంటి గేమ్‌లను ఆడవచ్చు. అంతేకాకుండా ఇది లిక్విడ్‌కూల్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దీని కారణంగా గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చేస్తుంది.

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8GB RAM + 256GB, 12GB RAM + 512GB వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 ఏళ్ల పాటు OS, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. Poco F6 5G ఫోన్ 50MP (Sony IMX882) ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

అదనంగా ప్రాథమిక కెమెరాలో మల్టీ-డైరెక్షనల్ PDAF, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతు కూడా అందుబాటులో ఉంది. ఇక సెల్ఫీ కోసం 20MP (OV20B) ఫ్రంట్ కెమెరా అందించబడింది. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరో సెన్సార్ వంటి ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×