Nokia 5G Ultra: టెక్ మార్కెట్‌ని మరోసారి షేక్ చేయడానికి నోకియా ముందుకు వచ్చింది. స్మార్ట్‌ఫోన్ రేస్ నుండి కొంతకాలంగా సైలెంట్ ఉన్న నోకియా, ఇప్పుడు తిరిగి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో అడుగు పెట్టింది. తన స్థానాన్ని మళ్లీ స్థిరపరచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై నోకియా తాజా 5జీ అల్ట్రా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ తర్వాతి తరం మొబైల్ టెక్నాలజీకి మార్గం చూపేలా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ప్రధాన బ్రాండ్స్‌తో ప్రత్యక్ష పోటీ స్థాయిలో ప్రవేశిస్తున్న ఈ ఫోన్, ఫొటోగ్రఫీ, గేమింగ్, లాంగ్ యూజ్ బ్యాటరీ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చేయబడినట్లు సమాచారం.
250ఎంపి జైస్ ప్రధాన కెమెరా
ఈ కొత్త నోకియా అల్ట్రా 5జీ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 250ఎంపి జైస్ ప్రధాన కెమెరా. మొబైల్ ఫొటోగ్రఫీ లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా 250 మెగాపిక్సెల్ సెన్సర్‌ను జైస్ ఆప్టిక్స్‌తో కలిపి తీసుకురావడం చాలా పెద్ద అడుగు. నైట్ షాట్స్, ల్యాండ్‌స్కేప్ ఫొటోలు, మాక్రో వివరాలు ఎదైనా తీసినా చిన్న చిన్ వివరాలు అద్భుతమైన స్పష్టతతో రికార్డ్ అవుతాయి. అంతేకాదు, ఈ ఫోన్‌లో అందించిన 220X జూమ్ టెక్నాలజీ మరొక పెద్ద ఆకర్షణ. దూరంగా ఉన్న వస్తువులు కూడా ఆప్టికల్ క్లారిటీ తగ్గకుండా చాలా దగ్గరగా చూపించే సామర్థ్యంతో ఈ ఫోన్ కెమెరా మొబైల్ ఫొటోగ్రఫీని మరో స్థాయికి తీసుకువెళ్తుంది.
ప్రీమియం మెటల్ అండ్ గ్లాస్ కాంబినేషన్ డిజైన్
డిజైన్ విషయానికి వస్తే, తాజా నోకియా అల్ట్రా 5జీ ఫోన్ ప్రీమియం మెటల్ అండ్ గ్లాస్ కాంబినేషన్‌తో ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తుంది. అప్‌డేటెడ్ లుక్‌తో కూడిన కర్వ్డ్ డిజైన్ చేతిలో పట్టుకున్న వెంటనే ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. సన్నని బిజెల్స్, స్మూత్ ఎడ్జ్‌లు, బలమైన నిర్మాణం (స్ట్రాంగ్ స్ట్రక్చర్) ఈ మొత్తం కలయిక నోకియా ఫోన్‌ను ప్రీమియం రేంజ్‌లో అత్యుత్తమంగా నిలబెడుతుంది. ఐపి68 వాటర్ డస్ట్ ప్రొటెక్షన్ రేటింగ్ ఉండబోతుందని అంచనా.
కర్వ్డ్ 2కే డిస్‌ప్లే
డిస్‌ప్లే విషయానికి వస్తే, కర్వ్డ్ 2కే డిస్‌ప్లే మరింత క్లారిటీ అందిస్తుంది. కలర్ అక్యూరసీ, డీటైల్ ప్రెసిషన్ మంచిగా కనిపించేలా రూపొందించారు. హై రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోల్ చేసే ప్రతి కదలిక స్మూత్‌గా అనిపిస్తుంది. సినిమాలు, హై క్వాలిటీ వీడియోలు, గేమింగ్ ఏ సందర్భంలోనైనా ఇమ్మర్సివ్ విజువల్ అనుభూతి లభిస్తుంది. ఈ డిస్‌ప్లే టెక్నాలజీ నోకియా అల్ట్రాను ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో నిలబెడుతుంది.
ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, తగినంత ర్యామ్ ఎంపికలతో కలిసి హెవీ అప్లికేషన్‌లు, హై గేమింగ్, వీడియో ఎడిటింగ్ అన్నింటినీ స్మూత్‌గా నిర్వహిస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఆప్టిమైజ్ చేసి అనవసరమైన ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు తగ్గించడం వలన అనుభవం మరింత వేగవంతంగా, స్మూత్‌గా మారుతుంది.
7000ఎంఏహచ్ బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే, భారీ 7000ఎంఏహచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉన్న మరో అద్భుతమైన అంశం. ఒక్కసారి ఛార్జ్ చేసి గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ యూజ్ ఎంత సేపు వాడినా, పూర్తిగా ఓ రోజు అంతా ఫోన్ వాడుకునే సామర్థ్యం కలిగి ఉంది. 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వలన ఛార్జింగ్ ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. రోజువారీ ఉపయోగానికి తగిన శక్తి త్వరగా అందుబాటులోకి వస్తుంది. పవర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ బ్యాటరీ వినియోగాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీ, స్పీడ్ డౌన్‌లోడ్లు, ఆన్‌లైన్ వీడియో కాల్స్ ఇవి అన్నీ మరింత శక్తివంతంగా అనుభూతి ఇస్తాయి. అప్‌డేటెడ్ బ్లూటూత్, వైఫై సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ కూడా అందిచారు.
ఇండియాలో ధర ఎంతంటే?
ఇండియాలో ధర విషయానికి వస్తే, అధికారిక ప్రకటనా వివరాలు ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, టెక్ మార్కెట్ అంచనా ప్రకారం నోకియా అల్ట్రా 5జీ ఫ్లాగ్‌షిప్ భారత మార్కెట్లో సుమారు రూ.55,000 నుండి రూ.65,000 మధ్య ధరలో రావచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ మోడల్ అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది, అధికారిక ధర, సేల్ తేదీ త్వరలోనే ప్రకటించబడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తు మార్కెట్‌ని లక్ష్యంగా పెట్టుకున్న పూర్తి స్థాయి శక్తివంతమైన ఫోన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.