Oppo Phone: మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త డిజైన్, రోజుకో కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంది. అందులో ఇటీవల ఎక్కువ హిట్ అవుతున్న ట్రెండ్ ఫ్లిప్ ఫోన్లదే. అదే తరహాలో ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ 5జి ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం ఒక గాడ్జెట్ మాత్రమే కాదు, చేతిలో పట్టుకున్నవారికి ఒక స్టైల్ సింబల్ లాంటిది.
డిస్‌ప్లే అదిరింది
మూసి పెట్టినప్పటికీ నోటిఫికేషన్లు చూసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ముందు భాగంలో ఒక సెకండరీ స్క్రీన్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద అమోలేడ్ డిస్ ప్లే కనబడుతుంది. ఈ డిస్ ప్లేలో కలర్స్ చాలా క్లియర్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. సినిమాలు చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయటం, గేమ్స్ ఆడటం అన్నీ ప్రీమియం అనుభూతినే ఇస్తాయి.
మల్టీటాస్కింగ్ – స్మూత్‌గా రన్
ఇంటర్నల్ స్టోరేజ్ విషయంలో ఈసారి ఒప్పో ఎలాంటి కంప్రమైజ్ చేయలేదు. 256జిబి స్టోరేజ్ అందిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, గేమ్స్ ఏది అయినా ఇబ్బంది లేకుండా దాచుకోవచ్చు. ర్యామ్ కూడా శక్తివంతంగా ఉండటం వల్ల, ఫోన్ వేగంగా పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్ చేయడంలో కూడా ల్యాగ్ లేకుండా స్మూత్‌గా రన్ అవుతుంది.
Also Read: Hemoglobin Deficiency: హిమోగ్లోబిన్ లోపమా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్
హై స్పీడ్ ఇంటర్నెట్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 5జి చిప్‌సెట్‌తో వస్తోంది. దాంతో హై స్పీడ్ ఇంటర్నెట్, సూపర్ ఫాస్ట్ యాప్ ఓపెనింగ్స్, గేమింగ్ అన్నీ కలిపి ఒక పవర్ ప్యాక్డ్ అనుభవం లభిస్తుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ రూపొందించబడిందని చెప్పవచ్చు.
మల్టీ కెమెరా సిస్టమ్
కెమెరా ఒప్పో ఫోన్లలో ఎప్పటిలాగే ఒక హైలైట్. వెనుక భాగంలో మల్టీ కెమెరా సిస్టమ్ ఎన్3 ఫ్లిప్ ఉంది. ఫోటోలు డే లైట్‌లోనూ, నైట్ మోడ్‌లోనూ చాలా క్లియర్‌గా వస్తాయి. ముఖ్యంగా ఈ ఫ్లిప్ డిజైన్ వలన సెల్ఫీలు కూడా మెయిన్ కెమెరాతో తీయగలగడం ఒక ప్రత్యేకమైన ఫీచర్. వీడియో రికార్డింగ్స్ కూడా సినిమాటిక్ లుక్ ఇస్తాయి.
ఫాస్ట్ ఛార్జింగ్
రోజువారీ వాడకానికి తగిన బ్యాటరీ కెపాసిటీని అందించడమే కాకుండా, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా కలిపారు. కేవలం కొద్ది నిమిషాల ఛార్జ్‌తోనే ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్ మోడల్స్ అంటే ఇష్టమైతే, స్టైల్‌తో పాటు పనితీరు కూడా కావాలనుకుంటే ఈ ఫోన్ మీ కోసం తయారైనట్టే.