Verify Fake iphone | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ సీజన్‌లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లు ముఖ్యంగా ఐఫోన్లు కొనుగోలు చేసే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఐఫోన్ 17 విడుదల తరువాత ఎక్కువ మంది ఐఫోన్ 16 ప్రో ధర తగ్గిందని భావించి దాని కోసం ఆర్డర్ చేస్తున్నారు.
ఆ లేటెస్ట్ మోడల్ ధర రూ.80,000 పైనే ఉంటుంది. ఇంత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నప్పుడు, ఫోన్ ఒరిజినల్ లేదా నకిలీ దా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఓపెన్ బాక్స్ డెలివరీ ద్వారా డెలివరీ సిబ్బంది మీ ఎదుట బాక్స్ తెరవడం వల్ల కొంత నమ్మకం కలుగుతుంది. అయినప్పటికీ, కొన్ని సులభమైన దశల ద్వారా మీరు కొన్న ఐఫోన్ ఒరిజినల్ అని నిర్ధారించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు కొనడం ఎప్పుడూ కొంత ప్రమాదంతో కూడుకున్నది. ముఖ్యంగా షాపింగ్ ఫెస్టివల్ సమయంలో నకిలీ ఉత్పత్తులు డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ బాక్స్ డెలివరీ ఎంచుకుంటే ఈ మోసాలను కొంత మేరకు అరికట్టవచ్చు అయితే ఈ స్టెప్స్‌లను అనుసరించడం ద్వారా మీరు మీ కొనుగోలు గురించి పూర్తి భరోసా పొందవచ్చు.
ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాక.. డెలివరీ సిబ్బంది సమక్షంలో బాక్స్ తెరవండి. బాక్స్ మీద సీరియల్ నంబర్ ఉంటుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక టూల్ ఉంటుంది, అందులో ఈ సీరియల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఒకవేళ “డివైస్ యాక్టివేట్ కాలేదు” అని చూపిస్తే, అది కొత్త ఫోన్‌కు సంకేతం. అయితే, “డివైస్ యాక్టివేట్ అయింది” అని వస్తే, ఆ ఫోన్ ఇంతకు ముందు ఉపయోగించబడిందని అర్థం.
ఫోన్‌ను యాక్టివేట్ చేయకముందే, IMEI నంబర్‌ను తనిఖీ చేయండి. ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సీరియల్ నంబర్ పైన లేదా కింద ఉన్న IMEI నంబర్‌ను చూడండి. ఈ నంబర్‌ను బాక్స్ మీద ఉన్న IMEI నంబర్‌తో సరిపోల్చండి. అలాగే, సీరియల్ నంబర్ కూడా వెరిఫై కావాలి. ఒకవేళ ఈ నంబర్‌లు వెరిఫై కాకపోతే.. మీ కొనుగోలును రద్దు చేసుకోవాలో లేదా కొనసాగించుకోవాలో ఆలోచించుకోండి.
మీ ఫోన్ మోడల్ రకాన్ని సెట్టింగ్స్‌లో చెక్ చేయండి. సాధారణంగా, మోడల్ నంబర్ మొదటి అక్షరం ద్వారా ఫోన్ రకాన్ని తెలుసుకోవచ్చు:
నిజమైన ఐఫోన్‌లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందుతాయి, కానీ నకిలీ ఫోన్‌లు కొంత కాలానికి పనిచేయడం మానేస్తాయి. షాపింగ్ ఫెస్టివల్ సమయంలో నకిలీ ఉత్పత్తులు అమ్మే అవకాశం ఎక్కువ. ఫోన్ నిజమైనదని ధృవీకరించడం ద్వారా మీ డబ్బు, సమయం ఆదా అవుతుంది. మీ కొత్త ఐఫోన్‌ను ఆనందంగా ఉపయోగించడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో నిశ్చింతగా షాపింగ్ చేయండి!
Also Read: ఐఫోన్లలో హ్యాకింగ్ ప్రమాదం.. వెంటనే ఇలా చేయాలని సూచించిన యాపిల్ కంపెనీ