Sudigaali Sudheer Hailesso: లాంగ్ గ్యాప్ తర్వాత సుడిగాలి మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఈసారి పాన్ ఇండియా మూవీ సిద్ధమయ్యాడు. హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన సుధీర్కి ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. మొన్నటి వరకు సైలెంట్గా అతడు సర్కార్ వంటి షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత యాంకర్, హీరోగా ఎదిగాడు సుధీర్. జబర్ధస్త్ షోతో బుల్లితెరపై కమెడియన్గా గుర్తింపు పొందాడు. తనదైన కామెడీ పంచ్లతో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఢీ షోలో మెంటర్గా వ్యవహరించి.. ఆ క్రేజ్ని మరింత పెంచుకున్నాడు.
అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. స్టార్ హీరో రేంజ్లో ఉంటుంది. సుధీర్కి ఆ ఫాలోయింగే అతడిని హీరోని చేసిందనడంలో సందేహం లేదు. అలా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే టైటిల్తోనే హీరోగా మారాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేశాడు. అందులో బ్రేక్ ఈవెన్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో సుధీర్ హీరోగా దీపిక పిల్లి, విష్ణు ప్రియ హీరోయిన్లుగా వచ్చిన ‘గాలోడు‘ మంచి విజయం సాధించింది. అందులో కంటెంట్ పెద్దగా లేకపోయినా.. సుధీర్ క్రేజ్ ఈ చిత్రాన్ని నిలబెట్టింది. కలెక్షన్స్ కూడా బాగానే చేసింది. ఆ తర్వాత కాలింగ్ సహస్ర అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది.
ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో సుధీర్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుని.. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ హీరోగా ఓ సినిమాకు కమిటయ్యాడు. దీనికి హైలెస్సో అనే టైటిల్ని ఫిక్స్ చేసి ప్రకటించారు. ఇవాళ(సెప్టెంబర్ 29) పూజ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా పూజ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి కుమార్ కోట దర్శకత్వం వహిస్తుండగా.. శివ చెర్రి, రవికిరణ్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటషా సింగ్, నక్ష శరన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్ బాస్ శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర తారగణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥
A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥
Shoot begins soon⌛️
In Telugu, Tamil, Malayalam & Kannada✨ pic.twitter.com/WejxJMFhuA
— Vajra Varahi Cinemas (@VVCOffl) September 29, 2025
ఇక మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ.. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ పోస్టర్ అమ్మవారి అవతారంలో ముస్తాబైన వ్యక్తి కాలుని చూపించారు. అమ్మవారి అవతారంలో కత్తి పట్టుకుని ఉన్న అమ్మవారికి నైవద్యంగా కోడి, అన్నం పెట్టినట్టు చూపించారు. ‘మన పవిత్రమైన దేవదూత భయంకరమైన అవతారంలో రాబోతోంది. సుధీర్ ఐదో చిత్రంగా వస్తున్న హైలెస్సో.. అంతరించిపోతున్న మన దైవికమైన సంస్కృతికిని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ కథ మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది‘ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మూవీ టీం పోస్ట్ లో వెల్లడించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తుండటం విశేషం.