Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది నిరసనలు చేస్తున్నారు. మౌలిక సంస్కరణలను కోరుతూ.. భారీ సంఖ్యలో జనం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
పాకిస్తాన్‌లోని కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలంటూ డిమాండ్..
పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలంటూ.. 38 డిమాండ్లతో షటర్ డౌన్.. వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పీఓకేలో భారీగా పోలీసులను మోహరించిన పాక్ ప్రభుత్వం
అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో పీవోకేలో భారీగా పోలీసులను మోహరించింది పాక్ ప్రభుత్వం. ఆదివారం అర్థరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకుని.. చెక్ పోస్టులు, మెయిన్ సెంటర్లలో భారీగా మోహరించారు.
Also Read: అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో 9 మందికి గాయాలు..
గత 70 ఏళ్లుగా ప్రజలకు నిరాకరించబడిన.. ప్రాథమిక హక్కుల కోసమే ఈ పోరాటం -అవామీ యాక్షన్ కమిటీ..
మరోవైపు.. తమ ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకం కాదని తెలిపింది అవామీ యాక్షన్ కమిటీ. గత 70 ఏళ్లుగా తమ ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే ఈ పోరాటమని పేర్కొన్నారు. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యతని తెలిపారు. పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలంటూ నిరసనలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది అవామీ యాక్షన్ కమిటీ.