Poco X7 Pro vs Oppo F31 vs Realme P4 Pro| ఓప్పో F31 5జీ ఫోన్ ఇటీవల భారత్‌లో లాంచ్ అయింది. ఇది రియల్మీ P4 ప్రో 5జీ, పోకో X7 ప్రో 5జీలతో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్‌లు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. సాధారణ, గేమింగ్ వినియోగాలకు బాగా సరిపోతాయి. ఓప్పోలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. రియల్మీలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ఉపయోగించారు. పోకోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్ ఉంది. ధరలు, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటివి పోల్చి చూస్తే, మీరు ఏది కొనుగోలు చేయాలో నిర్ణయం తీసుకునేందుకు సులువుగా ఉంటుంది.
ధర, స్టోరేజ్ ఆప్షన్లు
ఓప్పో F31 5జీ బేస్ మోడల్ (8జీబీ ర్యామ్ + 128జీబీ) ధర రూ.22,999. 8జీబీ + 256జీబీ ధర రూ.24,999. మరోవైపు రియల్మీ P4 ప్రో 5జీ కూడా 8జీబీ + 128జీబీకి రూ.22,999, 8జీబీ + 256జీబీకి రూ.24,999. చివరగా పోకో X7 ప్రో 5జీ 8జీబీ + 256జీబీకి రూ.20,999 మాత్రమే. 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.22,999. పోకో తక్కువ ధరలోనే ఈ ఫీచర్లు ఇస్తుంది. అందుకే ధర ప్రకారం.. పోకో మంచి డీల్.
ఓప్పో F31 5జీలో 6.7-అంగుళాలు FHD+ డిస్‌ప్లే ఉంది. రెజల్యూషన్ 2372×1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్. పిక్సెల్ డెన్సిటీ 397 PPI.
రియల్మీ P4 ప్రోలో 6.8-అంగుళాల AMOLED, 1280×2800 రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ – చాలా మెరుగైనది.
పోకో X7 ప్రోలో 6.67-అంగుళాల AMOLED, 2712×1220 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్, 240Hz టచ్ సాంప్లింగ్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్. ఎండలో కూడా ఉపయోగానికి బాగుంది.
ప్రాసెసర్ పవర్
ఓప్పో F31లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది, రోజువారీ పనులు సులభంగా చేస్తుంది. రియల్మీ P4 ప్రోలో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4, గేమింగ్‌కు మంచిది. పోకో X7 ప్రోలో డైమెన్సిటీ 8400 అల్ట్రా – భారీ యాప్‌లు, గేమ్స్‌కు సూపర్.
ఆపరేటింగ్ సిస్టమ్
ఓప్పో F31లో కలర్ ఓఎస్ 15 (ఆండ్రాయిడ్ 15 బేస్), రియల్మీ P4 ప్రోలో రియల్మీ UI 6.0 (ఆండ్రాయిడ్ 15), పోకో X7 ప్రోలో హైపర్‌ఓఎస్ 2.0 (ఆండ్రాయిడ్ 15). మూడూ మంచి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తాయి.
కెమెరా పోలిక
ఓప్పో F31: రియర్‌లో 50MP ప్రైమరీ + 2MP పోర్ట్రెయిట్, ఫ్రంట్ 16MP కెమెరా ఉంది.
రియల్మీ P4 ప్రో: 50MP f/1.8 ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్, ఫ్రంట్ 50MP f/2.4 – సెల్ఫీలకు బాగుంటుంది.
పోకో X7 ప్రో: 50MP OIS ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్, ఫ్రంట్ 20MP కెమెరా ఉంది.
కనెక్టివిటీ
ఓప్పో F31: 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, టైప్-సి ఫీచర్స్‌ను సపోర్ట్ చేస్తుంది.
రియల్మీ P4 ప్రో: డ్యూయల్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, GPS.
పోకో X7 ప్రో: వై-ఫై 6, 5జీ, బ్లూటూత్ 5.4, USB OTG, NFC.
బ్యాటరీ
ఓప్పో F31 లో పెద్ద 7000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రియల్మీ P4 ప్రో కూడా 7000mAh కలిగి ఉంది. 80W చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో X7 ప్రో: 6550mAh, 90W చార్జింగ్ – త్వరగా ఛార్జ్ అవుతుంది.
విన్నర్ ఎవరు?
ఈ మూడింట్లో పోకో X7 ప్రో 5జీ క్లియర్ విన్నర్. ధర తక్కువ, స్పెసిఫికేషన్లు బాగున్నాయి. రియల్మీ P4 ప్రో డిస్‌ప్లే, డిజైన్‌లో ముందంజలో ఉంది. ఓప్పో F31 సాధారణ వినియోగానికి సరిపోతుంది. మీ అవసరాలకు తగ్గట్టు ఎంచుకోండి.