BigTV English

Oppo Find X8: ఒప్పో నుంచి కెమెరా కింగ్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?

Oppo Find X8: ఒప్పో నుంచి కెమెరా కింగ్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?

Oppo Find X8: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Oppo మరో అడుగు ముందుకేసింది. తన లైనప్‌లో ఉన్న మరో సిరీస్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే Oppo Find X8 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్‌లో Find X8, Find X8 Pro, Find X8 Ultra ఉండే అవకాశం ఉంది. ఇటీవలి ఈ అన్ని మోడళ్లకు సంబంధించి అనేక లీక్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. వీటిలో వాటి స్పెసిఫికేషన్‌లు కూడా అంచనా వేయబడ్డాయి.


ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వనిల్లా మోడల్ ఫ్లాట్ ప్యానెల్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే ప్రో మోడల్‌లో మైక్రో కర్వ్డ్ ప్యానెల్ ఉన్నట్లు లీక్‌లో వెల్లడైంది. అయితే ఇప్పుడు Oppo Find X8 మోడల్‌ డిస్ప్లే, కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయింది. తాజాగా చైనీస్ టిప్‌స్టర్ Oppo Find X8 మోడల్‌‌ సమాచారాన్ని లీక్ చేశాడు. అతని ప్రకారం.. Oppo Find X8 స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ఒక పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు.

Also Read: మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీతో వచ్చేస్తుంది.. ఇక చెడుగుడే..!


అలాగే ఇది ఒక ఫ్లాట్ ప్యానెల్ కలిగి ఉందని చెప్పబడింది. ఇది కర్వ్డ్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో Oppo Find X8 ప్రత్యేకత దాని బ్యాటరీ అని చెప్పబడింది. ఇది మరింత సామర్థ్యం కోసం సిలికాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. Oppo Find X8 3X పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఈ ఫోన్ ప్రధాన వెనుక కెమెరా 1/1.4-అంగుళాల పెద్ద పరిమాణంతో 50-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని ఇటీవలి లీక్‌లు తెలిపాయి. మెరుగైన కెమెరా పనితీరు కోసం కొత్త ఇమేజ్-ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లు ఇందులో అందించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సాఫ్ట్‌వేర్ కోసం ColorOS 15 వెర్షన్ Find X8లో అందుబాటులో ఉంటుందని చెప్పబడింది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సిరీస్ ఫోన్లు 6,000mAh బ్యాటరీతో అమర్చబడి ఉంటాయని సమాచారం. కాగా Oppo Find X8 సిరీస్‌ను అక్టోబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Oppo A6 Max vs K13: రెండు ఒప్పో కొత్త ఫోన్లు.. మిడ్ రేంజ్ లో ఏది బెటర్?

OnePlus Pad 3: ఇండియాలో పవర్‌ఫుల్ టాబ్లెట్.. అడ్వాన్స్ ప్రాసెసర్‌తో వన్ ప్లస్ ప్యాడ్ 3 లాంచ్

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Pixel 10 Pro Alternatives: పిక్సెల్ 10 ప్రో కంటే బెటర్? టాప్ కెమెరా ఫోన్లు ఇవే..

AI Security Robots: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?

Big Stories

×