పండుగ సీజన్ కావడంతో ఓ యువకుడు తన సొంతూరుకు వెళ్లేందుకు రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. ప్రయాణీకుల రద్దీ కారణంగా, ఒక RAC సీటు లభించింది. చివరికి రైలు ఎక్కిన తర్వాత తను బెర్త్ షేర్ చేసుకోవాల్సింది ఓ యువతితో కావడంతో కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తాజాగా రెడ్డిట్ వేదిగా వెల్లడించే ప్రయత్నం చేశాడు. తమ ప్రయాణం ఎలా కొనసాగిందో వివరించాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సదురు యువకుడు తన ప్రయాణానికి సంబంధించిన విషయాలను ‘r/IndianRailways’ సబ్ రెడిట్‌లో పోస్టులో పంచుకున్నారు. “నేను ఇటీవల మా సొంతూరుకు వెళ్లేందకు రైలు టికెట్ బుక్ చేసుకున్నాను. ప్రయాణీకుల రద్దీ కారణంగా RAC బెర్త్ లభించింది. రైలు ఎక్కిన తర్వాత నేను బెర్త్ షేర్ చేసుకోవాల్సింది ఓ యువతితో అని తెలిసింది. మొదట, నేను తనతో ప్రయాణం ఇబ్బంది కరంగా ఉంటుందని భావించాను. ఎందుకంటే నేను ఇంట్రావర్ట్ ను. సాధారణంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్నట్లు నటిస్తూ సుదూర ప్రయాణాలు చేస్తాను” అని రాసుకొచ్చాడు.
కానీ, తాను అమ్మాయితో కలిసి ప్రయాణించడం చాలా ఇబ్బంది అనుకున్నప్పటికీ, పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించిందన్నాడు సదరు యువకుడు.“నాతో సీటు పంచుకున్న ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉంది. త్వరలోనే ఆమె స్నేహితులు కూడా మాతో పాటు సంభాషణలో పాల్గొన్నారు. చిన్న ముచ్చట్లు జీవితం, ప్రయాణం, ఆహారం గురించి మాట్లాడుకున్నాడం. నాకు తెలియకుండానే 15 గంటలు గడిచిపోయాయి” అన్నాడు. స్నాక్స్ మాత్రమే కాదు, తమ గురించి పలు విషయాలను చెప్పుకున్నట్లు వెల్లడించాడు. ఆమెతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు చెప్పాడు.“మేము దిగాల్సిన స్టేషన్ కు చేరుకున్నప్పడు సాధారణ ‘వీడ్కోలు’ చెప్పి వెళ్లిపోయాం. నంబర్స్ ఛేంజ్ లేదు. టచ్ లో ఉండండి లాంటి మాటలు లేవు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి వారుగా వెళ్లిపోయాం. సాధారణంగా తొందరపడే ప్రపంచంలో ఇది ఒక మంచి, మానవీయ క్షణంగా మారిపోయింది” అని సదరు యువకుడు తన ప్రయాణ అనుభవాన్ని వివరించాడు.
ఈ స్టోరీని చదివి రెడ్డిట్ వినియోగదారులు క్రేజీగా ఫీలవుతున్నారు. “ఇది గొప్ప ‘హౌ ఐ మెట్ యువర్ మదర్’ ఎపిసోడ్‌గా అనిపిస్తుంది” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ప్రజలు తమ ఫోన్‌లను స్క్రోల్ చేయడానికి బదులుగా ప్రయాణాలలో తోటి ప్రయాణీకులతో మాట్లాడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇది చాలా మంచి విషయం” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇద్దరు 15 గంటలు కలిసి ప్రయాణం చేసినా, నెంబర్స్ ఛేంజ్ చసుకోకపోవడం ఆసక్తికర విషయం. మంచి జ్ఞాపకాలు సమస్యలు లేకుండా ఒకరితో ఒకరు ఉంటారు” ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: వైజాగ్ కు ప్రత్యేక రైలు, దీపావళి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్!