Rahul Sipligunj -Harinya: ప్రముఖ టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈయన హైదరాబాద్ కి చెందిన హరిణ్య(Harinya)తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం(Engagment) జరిగిన సంగతి తెలిసిందే. ఇలా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సింగర్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అని తెలియజేశారు. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే.
హరిణ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయని తెలుస్తోంది.. ఇక వీరి నిశ్చితార్థం తర్వాత తరచూ రాహుల్ హరిణ్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకే వీరిద్దరూ కలిసి తమ స్నేహితులతో బ్యాచిలర్ పార్టీని ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్న ఈ జంట తాజాగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరి వివాహం ఎప్పుడు ఎక్కడ అనే వివరాలను మాత్రం ఈ జంట వెల్లడించలేదు కానీ తాజాగా హరిణ్య, రాహుల్ తమ ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్(Pre wedding Celebrations) కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. పసుపు దంచే కార్యక్రమంతో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హరిణ్యా లంగావోణీలో చాలా సాంప్రదాయ బద్దంగా కనిపించారు. ఇలా ఈ వేడుకలో భాగంగా రాహుల్ హరిణ్యకు సంబంధించిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ముందుగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
రాహుల్ ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా అలాగే సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన గురించి గతంలో ఎన్నో రకాల లవ్ రూమర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే . రాహుల్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో మరొక కంటెస్టెంట్ పునర్నవి, ఆశురెడ్డి వంటి వారితో ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు అన్నింటిని కొట్టి పారేస్తూ రాహుల్ హరిణ్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధమయ్యారు. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లితేదీతో పాటు పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Lokah OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘ లోక’ … స్ట్రీమింగ్ ఎప్పుడంటే?