Pune Crime: ఈ మధ్యకాలంలో భార్యభార్తల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చివరకు అనుమానాలకు దారితీస్తోంది. అది పెనుభూతంగా మారుతుంది. ఆవేశంలో హత్య చేసే వరకు వెళ్తుంది. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి పూణెలో చోటు చేసుకుంది. తనపై చీటికీ మాటికీ భర్త అనుమానం పడడంతో చీరతో భర్త గొంతు కోసింది భార్య. అసలేం జరిగింది?
పూణెలో దారుణం
పూణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో నకుల్ భోయిర్-చైతాలి భోయిర్ భార్యభర్తలు ఉంటున్నారు. నకుల్ సామాజిక కార్యకర్త, అంతేకాదు శరద్ పవార్ గ్రూప్ కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా. స్థానిక సమస్యలపై పని చేసేవాడు, రాజకీయంగా చురుకుగా ఉండేవాడు కూడా. పర్యావరణ ఉద్యమంలో చురుకుగా ఉండేవాడు. ఆ ప్రాంతంలో అతడ్ని ధన్యవాఘ్ అని ప్రజలు పిలుచుకునేవారు.
నకుల్ భార్య చైతాలి ఇంట్లో ఉండేది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి రెండేళ్లు. పిల్లలు పెద్దవారు కావడంతో భార్యకు చీరల షాపును ఏర్పాటు చేశాడు భర్త. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైతాలి భోయిర్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. మరి భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. చీటికి మాటికీ గొడవ పడేవారు.
భర్త గొంతు నులిమి, ఆ తర్వాత కోసేసింది
భార్య ప్రవర్తనపై తరచూ అనుమానం పడేవాడు నకుల్. ఈ క్రమంలో గొడవలు సైతం జరిగేవి. గురువారం అర్థరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానగా మారింది. చైతాలి బోయిర్‌పై భర్త నకుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోజు రోజుకూ భర్త టార్చర్ తట్టుకోలేకపోయింది. గొడవ తర్వాత ఆవేశంతో చీరతో భర్త గొంతు నులిమి ఆ తర్వాత కోసి చంపేసింది. అప్పటికి గానీ చైతాలీ పగ తీరలేదు.
ALSO READ: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఘటన జరిగిన సమయంలో పిల్లలు ఇద్దరు వేరే గదిలో ఉన్నారు. స్థానికులు ఫిర్యాదుతో చైతాలిని పోలీసులు అరెస్టు చేశారు. నకుల్.. భార్య ప్రవర్తనను అనుమానించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివాదానికి ఖచ్చితమైన విషయాలు, సంఘటన వెనుక ఉన్న ఇతర అవకాశాలను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇరుగు పొరుగువారు, బంధువులను విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ జంట 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.