BigTV English

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?
Advertisement

విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడంతో పాటు అక్కడి పోటీ ప్రపంచంలో రాణించాలంటే.. ముందుగా కొన్ని పనులు చేయాలంటున్నాడు మహారాష్ట్రకు చెందిన సుమిత్ చించన్ సురే. ప్రస్తుతం జపనీస్ ఫిన్ టెక్ కంపెనీలో సైట్ రీలయబులిటీ ఇంజినీర్(SRE)గా పని చేస్తున్నారు. ఏడాదికి దాదాపు 10 మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 59 లక్షలు సంపాదిస్తున్నారు. జపాన్ లో పని చేసే ఆయన, తాజాగా తన జాబ్, ప్యాకేజీ, ఆ దేశ సంస్కృతి గురించి కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


టెక్ మైండ్స్ జపాన్ అనే ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో, సుమిత్ తన ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాకెండ్ ఇంజనీర్‌గా ఎలా ప్రారంభించాడో చెప్పాడు. గత ఐదు సంవత్సరాలలో డెవ్‌ ఆప్స్, రిలయబుల్ ఇంజనీరింగ్‌ లోకి ఎలా మారాడో గుర్తుచేసుకున్నాడు. జపాన్ లో  అత్యంత పోటీ ఉన్న టెక్ పరిశ్రమలో వృత్తిపరమైన వృద్ధికి ప్రధాన కారణాలను ఆయన ఇందులో ప్రస్తావించాడు. జపాన్ లో ఉద్యోగాలు చేయాలనుకునే యువకులకు కొన్ని కీలక సూచనలు చేశాడు.

ముందుగా జపనీస్ నేర్చుకోండి!

తనలాంటి కెరీర్ ప్రొఫైల్‌ ను ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చని చెప్పిన సుమిత్, కానీ, రెండు చిట్కాలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. జపాన్ లో ఉద్యోగం చేయాలనుకునే వారు జపనీస్ భాషను నేర్చుకోవాలన్నారు. జపనీస్ నేర్చుకోవడం వల్ల అక్కడి లోకల్స్ తో ఈజీగా కలిగిపోయే అవకాశం ఉందన్నారు. అటు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులు ముందుగా ఇండియాలో 3 నుంచి 4 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించాలన్నారు. “జపనీస్ నేర్చుకోండి. జపాన్ లో ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని సుమిత్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కొంత పని అనుభవం కలిగి ఉండటం వల్ల జపాన్  కార్పొరేట్ రంగంలో ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయన్నాడు.


జపాన్ వర్క్ కల్చర్ కు అనుగుణంగా మారుతూ..

జపాన్ లో మాత్రమే కాదు, ఏ దేశంలోనైనా ఉద్యోగాల్లో రాణించాలంటే అక్కడి వర్క్ కల్చర్ ను అలవర్చుకోవాలన్నాడు. తాను కూడా అలాగే చేశానన్నాడు. తన కెరీర్ ప్రారంభంలో పని చేసిన రెండు కంపెనీలు కూడా జపాన్ కు చెందినవేనన్నాడు. అంతేకాదు, అందులో తాను ఏకైక విదేశీ ఉద్యోగి అని చెప్పుకొవచ్చాడు. కానీ, ఇప్పుడు చాలా జపనీస్ సంస్థలు సౌకర్యవంతమైన, హైబ్రిడ్ వర్క్ స్టైల్ ను అవలంబిస్తున్నాయని చెప్పాడు. నిపుణులకు మెరుగైన పని, జీవిత సమతుల్యతను అందిస్తున్నాయని సుమిత్ వెల్లడించాడు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ప్రస్తుతం సుమిత్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 5.4 లక్షల వ్యూస్ దాటింది. ఈ వీడియో, జపాన్ వర్క్ కల్చర్, సాలరీల గురించి నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది. చాలా మంది వినియోగదారులు సుమిత్‌ ను ప్రశంసిస్తున్నారు. “అతడు అమెరికా, యూరప్ లో ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ, జపాన్ సురక్షితమైనదిగా భావిస్తున్నాడు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “అతను జపాన్‌ లో సగటు జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు. 10 మిలియన్ యెన్లు సీనియర్ స్థాయి సాలరీ. అతని కంపెనీ సీనియారిటీ కంటే ప్రతిభను స్పష్టంగా ప్రోత్సహిస్తుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మరికొందరు సుమిత్ ప్రశాంతమైన ప్రవర్తనను ప్రశంసించారు.

Read Also: నీటితో నడిచే కారు, ఇరాన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి!

Related News

దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Big Stories

×