BigTV English

Telangana Crop Loan Waiver: రెండో విడత రైతు రుణమాఫీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధం.. వచ్చేవారమే ఖాతాల్లోకి..

Telangana Crop Loan Waiver: రెండో విడత రైతు రుణమాఫీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధం.. వచ్చేవారమే ఖాతాల్లోకి..

Telangana rythu runa mafi latest news(TS today news): మొదటి విడత రైతు రుణమాఫీతో ప్రతిపక్షాలకు ధీటైన సమాదానం ఇచ్చిన రేవంత్‌ సర్కార్‌.. రెండో విడతకు రెడీ అయ్యింది. లక్షన్నర వరకు అప్పులున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో వచ్చే వారం రుణ సొమ్ము జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఈ క్రమంలో అవసరమైన నిధులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు కూడా డిపాజిట్ చేయడానికి వనరులను రెడీ చేసుకున్నారు.


మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయాలని భావించి లబ్ధిదారుల వివరాలను రెడీ చేశామన్నారు మంత్రి తుమ్మల. అయితే అందులో కొందరు రైతుల ఖాతాలకు టెక్నికల్ సమస్యలు రావడంతో సాధ్యం కాలేదన్నారు. రుణమాఫీ డబ్బులు రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్ విధానం ద్వారా జమ అవుతున్నట్లు తెలిపారు.

మొదటి విడతలో 84.94 కోట్ల రూపాయలు 17 వేల 877 లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకుండా రిటన్ అయ్యాయని తెలిపారు మంత్రి తుమ్మల. ఆ నిధులు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని తెలిపారు. టెక్నికల్ సమస్యలను సవరించిన తర్వాత ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి తుమ్మల వివరించారు.


Also Read: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మాజీ సీఎం కేసీఆర్ వస్తారా?

కొద్దిమంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారని.. వాటికి ఆర్బీఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు మంత్రి తుమ్మల. ఆ లబ్ధిదారుల వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించామనన్నారు. మొత్తం 15 వేల 781 ఖాతాలు ఉన్నట్లు తేలిందన్నారు. వాటి తనిఖీ దాదాపు పూర్తయిందని.. ఒకటి రెండు రోజుల్లో ఆ ఖాతాల్లో కూడా ఫస్ట్ ఫేజ్ రుణమాఫీ నిధులను జమ చేస్తామని తెలిపారు తుమ్మల.

 

Related News

Kavitha: కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెండ్

CM Revanth Reddy: వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Telangana News: కేసీఆర్-హరీష్‌రావులకు హైకోర్టులో స్వల్ప ఊరట.. ఎలాంటి చర్యలొద్దని ఆదేశం

BRS Politics: కవిత మేటర్ కేసీఆర్ చేతుల్లో..మళ్లీ అదే ఫార్ములా

CBI Enquiry: కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ.. జరగబోయేది ఇదేనా?

Rain Alert: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తుంది.

Big Stories

×