Bigg Boss 9 Telugu Day 47 Promo 2: రోజుకో ట్విస్ట్తో బిగ్ బాస్ (Bigg Boss Promo) ఆసక్తిగా మారుతోంది. ఫన్కి ఫన్.. ఆటకి ఆటతో షో రసవత్తరంగా సాగుతోంది. టాస్క్ల్లో అయితే గట్టి పోటి ఇస్తూ రణరంగం చేస్తున్నారు కంటెస్టెంట్స్. బంధాల చూట్టు తిరుగుతూ పడుకున్న హౌజ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లేచింది. ఇప్పుడు ఎవరికి వారు తమ గేడ్ ఆడుతూ కొత్త స్ట్రాటజీలతో కంటెస్టెంట్స్ తగ్గేదే లే అంటున్నారు. ప్రస్తుతం ఏడో వారానికి చేరింది. ప్రస్తుతం ఈ వారానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కొనసాగుతుంది.
బిగ్ బాస్ 9 డే 47వ రోజుకి సంబంధించి తాజాగా రెండో ప్రొమో విడుదల చేసింది టీం. ఇందుకోసం పెట్టిన హౌజ్ని గ్యాంగ్ లుగా డివైడ్ చేసి కంటెస్టెంట్స్ని గ్యాంగ్స్టర్ మార్చారు. వారి వారి ఆటతో డబ్బులు సంపాదించమని చెప్పారు. వాంటెడ్ పేట పేరుతో ఈ టాస్క్ లో అందరి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించి ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, కళ్యాణ్, దివ్య, అఖిల్లు కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నికయ్యారు. ఇక కెప్టెన్సీ కోసం పెట్టిన చివరి పోరులో ‘హ్యట్తో వేట‘ టాస్క్ ఇచ్చాడు.
సర్కిల్లో హ్యాట్ పెట్టి బయట నుంచి మొదట అది పట్టుకున్న వారు.. తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఇచ్చి.. కంటెండర్ నుంచి ఒకరిని తొలగించాలి. ఇలా మొదట హ్యాట్ పట్టుకున్న కళ్యాణ్.. గౌరవ్ కి ఇచ్చాడు. ఇక గౌరవ్ కళ్యాణ్ నే తొలగించి షాకిచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఇమ్మాన్యుయేల్ హ్యాట్ ని పట్టుకున్నాడ. అలా మొదటి సారి సంజనకు ఇవ్వగా ఆమె దివ్యను తొలగించింది. ఆ తర్వాత మాధురికి ఇవ్వగా.. ఆమె అఖిల్ ని తొలగించింది. తర్వాత రౌండ్ లోనూ హ్యాట్ మళ్లీ ఇమ్మాన్యుయేల్ చేతికే చిక్కింది. ఈసారి సంజనకు ఇచ్చాడు.. కానీ, గేమ్ మారిపోతుందని మాధురి హెచ్చరించడంతో.. హ్యాట్ తిసి మాధురికి ఇచ్చాడు ఇమ్మూ.
దీంతో మాధురి.. రీతూ ఎప్పుడూ ఒకరి హెల్స్తో టాస్క్ ఆడి గెలవాలని చూస్తుందంటూ తన కారణం చెప్పి కంటెండర్ని నుంచి తొలగించారు. ఇక చివరిగా ఇమ్మాన్యుయేల్, తనూజలు మిగిలారు. ఈ సారి కూడా హ్యాట్ని ముందుగా ఇమ్మాన్యుయేల్ పట్టుకున్నాడు. దీంతో వెంటనే తనూజ ఆగిపోయింది. అయితే టాస్క్ అనంతరం ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్టు ప్రొమోలో చూపించారు. అంత తనూజని లేపుతున్న లేవడం లేదు. దీంతో హౌజ్లో కాస్తా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే కెప్టెన్సీలో టాస్క్ గెలిచి ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. దీంతో అతడు కెప్టెన్ అవ్వడం ఇది రెండోసారి. ఈ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్ ఎవరనేది తేలిపోతుంది.
Also Read: Piyush Pandey: విషాదం.. దిగ్గజ ప్రకటనల రూకర్త పీయూష్ పాండే కన్నుమూత