BigTV English
Advertisement

Upma Breakfast : ఉప్మా ఇష్టం లేదా? AIIMS గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్ చెప్పింది తెలిస్తే.. వద్దనుకుండా తినేస్తారు

Upma Breakfast : ఉప్మా ఇష్టం లేదా? AIIMS గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్ చెప్పింది తెలిస్తే.. వద్దనుకుండా తినేస్తారు

Upma: ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత శిక్షణ పొందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సెప్టెంబర్ 5న ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆరోగ్య నిపుణులను.. సామాన్య ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ మన రోజును ప్రారంభించే బ్రేక్ ఫాస్ట్.. పేగు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరిస్తూ.. ఆయన 12 రకాల బ్రేక్ ఫాస్ట్‌లను 10 పాయింట్ల స్కేల్‌లో..ర్యాంక్ చేశారు. వీటిలో అత్యంత ప్రయోజనకరమైన వాటికి 10 పాయింట్లు ఇవ్వగా.. హానికరమైన వాటికి మైనస్ స్కోర్‌లను కేటాయించడం ఈ ర్యాంకింగ్‌లోని ప్రత్యేకత.


డాక్టర్ సేథి మాటల్లో.. “కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఆహారాలు మీ పేగుల పనితీరు మెరుగుపడటానికి సహాయ పడతాయి. మరికొన్ని దీనికి విరుద్ధంగా ఉంటాయి.

అత్యుత్తమ ‘గట్ ఫ్రెండ్లీ’ బ్రేక్ ఫాస్ట్: పర్ఫెక్ట్ 10
బ్రేక్ ఫాస్ట్ లిస్ట్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్రేక్ ఫాస్ట్ ఏదంటే.. అది బెర్రీలతో తయారు చేసిన గ్రీక్ పెరుగు దీనికి ఇచ్చిన పాయింట్లు 10కి 10. గ్రీక్ పెరుగులో సహజసిద్ధంగా ఉండే ప్రోబయోటిక్స్, పేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంపొందించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. దీనికి తోడు.. బెర్రీలలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పేగు గోడలకు రక్షణ కల్పిస్తాయి.


తరువాత స్థానంలో కూరగాయలు, గుడ్డు స్క్రంబుల్ 9/10 స్కోరుతో నిలిచింది. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ , పోషకాలు పేగులకు మేలు చేస్తాయి. ఇక చియా లేదా ఫాక్ సీడ్స్‌లో రాత్రంతా నానబెట్టిన ఓట్స్ 8/10 స్కోర్‌తో నిలవగా.. తియ్యని కేఫీర్, బెర్రీలు, పాలకూరతో చేసిన స్మూతీ (7/10) మంచి ప్రోబయోటిక్ కలిగి ఉంటుంది.

జాగ్రత్తలు:
నట్ బటర్ తో మొలకెత్తిన గ్రెయిన్ టోస్ట్ (6/10) మంచి ఫైబర్ మూలంగా ఉండగా.. మన తెలుగు వారికి ఇష్టమైన కూరగాయలతో ఉప్మా లేదా రుచి కరమైన ఓట్స్ (5/10) మధ్యస్థ ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. కూరగాయలు ఉన్నప్పటికీ.. వాటి తయారీ విధానం బట్టి దీని ప్రయోజనం మారుతుందని డాక్టర్ సేథి సూచించారు. అరటి పండు లేదా ఖర్జూరంతో స్టీల్-కట్ ఓట్ మీల్ (4/10) నాలుగో స్థానంలో ఉంది.

గట్ హెల్త్‌కు అత్యంత హానికరం: మైనస్ స్కోర్లు:
డాక్టర్ సేథి ర్యాంకింగ్‌లో.. అత్యంత ప్రమాదకరమైన ఎంపికలుగా నిలిచినవి చాలా ఆందోళనకరం. ఈ ఆహారాలలో.. జీర్ణ వ్యవస్థకు హాని చేసే ప్రాసెస్డ్ పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయని ఆయన హెచ్చరించారు:

చక్కెర కలిగిన బ్రేక్ ఫాస్ట్ తృణధాన్యాలు: మైనస్ 5/10

ఫాస్ట్ ఫుడ్ బర్రిటోలు : మైనస్ 10/10

వీటితో పాటు.. జామ్‌తో ప్లెయిన్ హోల్ వీట్ టోస్ట్ (3/10), దుకాణంలో కొన్న గ్రానోలా (2/10) లో అధిక చక్కెర కారణంగా తక్కువ ర్యాంక్‌లను పొందాయి. అలాగే.. చాలామంది తినే వెన్నతో తెల్ల బ్రెడ్ టోస్ట్ (1/10) అత్యంత తక్కువ ర్యాంకుల్లో ఉంది. దీనికి కారణం ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉండటమే.

డాక్టర్ సేథి ర్యాంకింగ్ ప్రకారం.. పేగు ఆరోగ్యం కోసం మనం కృత్రిమ చక్కెరలు, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రోబయోటిక్స్ (పెరుగు), ఫైబర్ (ఓట్స్, కూరగాయలు), ప్రొటీన్ (ఎగ్) అధికంగా ఉన్న బ్రేక్ ఫాస్ట్2లను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Blue Light: బ్లూ లైట్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ! కంటి సమస్యలతో ఇవి కూడా..

AC Effect on Skin: ఏసీలో ఎక్కువ సేపు గడిపితే.. ఎప్పటికి ముసలోళ్లు అవ్వరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

Pineapple: వీళ్లు.. పొరపాటున కూడా పైనాపిల్ తినకూడదు !

Stress Side Effects: ఒత్తిడితో ఈ ఆరోగ్య సమస్యలు.. తగ్గించుకోకపోతే ప్రమాదమేనట !

Calcium Rich Foods: పాలలోనే కాదు.. వీటిలోనూ పుష్కలంగా కాల్షియం

Sleep: మనం నిద్రపోతున్నప్పుడు.. శరీరంలో జరిగే 20 మార్పులు ఇవే !

Mental Health: మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిపే..5 సంకేతాలు

Big Stories

×