BigTV English

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

OPPO Find X8 series : ఒప్పో భీభత్సం.. కొత్త అప్డేట్స్ తో మరో రెండు ఫోన్స్.. కెమెరా, ప్రాసెసర్ మాత్రం సూపరో సూపర్

OPPO Find X8 series : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంఛ్​ చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో ఫైండ్​ ఎక్స్ 8 సిరీస్​ను తీసుకురానుంది. ఈ ఎక్స్ 8 సిరీస్​లో ఒప్పో ఫైండ్ ఎక్స్​ 8, ఫైండ్​ ఎక్స్​ ప్రో ఉండనున్నాయి. అలానే ఈ సిరీస్​ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్​ను ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలను తెలుసుకుందాం.


ఒప్పో త్వరలోనే తీసుకురాబోతున్న ఎక్స్ 8 సిరీస్​లో ఒప్పో ఫైండ్ ఎక్స్​ 8, ఫైండ్​ ఎక్స్​ ప్రో లీక్డ్​ స్పెసిఫికేషన్స్ స్మార్ట్ ఫోన్ ప్రియులను హోరెత్తిస్తున్నాయి. ఎప్పటిలాగే కొత్త మెుబైల్స్ లో సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తుంది. ఈ ఫోన్ ధర తో పాటు స్పెషిఫికేషన్స్ సైతం వావ్ అనిపించేలా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీరు ఆ  వివరాలపై ఓ లుక్కేయండి.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్​ 8 ప్రో మీడియా టెక్​ డైమన్సిటీ 9400 ఎస్​ఓసీతో పని చేస్తాయి. ఫైండ్ ఎక్స్ 8 6.59 అంగుళాల ప్లాట్ అమోలెడ్​ స్క్రీన్​, 1.5కే రిజల్యూ, 120 హెచ్​జెడ్​తో రానుంది. ప్రో మోడల్ వచ్చేసరికి 6.78 ఇంచ్, 2కే మైక్రో కర్వ్​డ్​ అమోలెడ్​ స్క్రీన్​, 120 హెడ్​జెడ్​ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ల డిస్​ ప్లేలు ఎల్​టీపీఓ టెక్నాలజీని కూడా కలిగి ఉన్నాయి.


ALSO READ : వాట్సాప్ లో చిన్న సెట్టింగ్ మార్పుతో ఐదుగురికి కాదు.. ఒకేసారి అందరికీ శుభాకాంక్షలు పంపొచ్చని తెలుసా!

ఈ స్మార్ట్ ఫోన్లు 100డబ్ల్యూ వైర్​డ్​, 50డబ్ల్యూ వైర్​లెస్​ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తాయి. అయితే ప్రో మోడల్ బ్యాటరీ 5,910ఎమ్​ఏహెచ్, స్టాండర్డ్​ వేరియంట్​తో (5,630 ఎమ్​ఏహెచ్​) పోలిస్తే కాస్త పెద్దది.

కెమెరా విషయానికొస్తే – ఎక్స్​ 8 ప్రో మోడల్​లో ఓఐఓ సపోర్ట్​తో 50 మెగా పిక్సల్​ సోనీ ఎల్​వైటీ 800 ప్రైమరీ సెన్సర్​ ఉంది. మెయిన్ కెమెరాలో 50 మెగా పిక్స్​ల్​ అల్ట్రా వైడ్​ లెన్స్​తో పాటు 50 మెగా పిక్సల్​ టెలిఫొటో పెరిస్కోప్ లెన్స్​​ కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ 8 ప్రో మోడల్​కు 4 రియర్ కెమెరాస్​ కూడా ఉన్నాయి. అందులో ఒకటి టెలిఫొటో షూటర్​, మరొకటి పెరిస్కోప్ లెన్స్. అంటే ఈ మోడల్​లో రెండు డ్యుయెల్​ పెరిస్కోప్​ టెలిఫొటో సెటప్​ ఉందన్నమాట. ఈ అడ్వాన్స్​ సెటప్​ ఫీచర్​లో ఒక టెలిఫొటో లెన్స్​ డిస్టంట్​ ల్యాండ్​స్కేప్ ఫొటోలను క్యాప్చర్ చేయగా, మరొకటి ప్రోర్​ట్రెయిట్​ ఫొటోగ్రఫీ కోసం పనిచేస్తుంది. మొత్తంగా ఈ లెన్స్​లు దూరంగా లేదా క్లోజ్​ అప్​ ప్రోర్​ట్రెయిట్స్​ను నేచురల్​, రిఫైన్డ్​ లుక్​​ ఫొటోస్​గా మార్చి అందిస్తాయి.

ఎక్స్​ 8 మోడల్​లో స్టాండర్డ్ ట్రిపుల్ కమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 50 మెగా పిక్సల్​ టెలిఫొటో, 50 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ ఎక్స్ 8 సిరీస్​లో 32 మెగా పిక్స్​ల్​ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఇంకా ఈ ఫైండ్ ఎక్స్​ 8 సిరీస్​ అండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్​ 15తో నడుస్తుంది. ఫైనల్​గా ఈ ఎక్స్​ 8 సిరీస్​ ధర రూ.54,250 నుంచి ప్రారంభం కావొచ్చు అని సమాచారం. అయితే దీన్ని చైనాలో మాత్రమే ప్రస్తుతానికి విడుదల చేయనున్నారు. భారత మార్కెట్​ రిలీజ్​పై ఇంకా స్పష్టత లేదు.

 

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×