E-Paper
Advertisement

Recharge Plan: మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గనున్న రీఛార్జ్ రేట్లు!

Recharge Plan: మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గనున్న రీఛార్జ్ రేట్లు!
Advertisement

Recharge Plan: కేంద్ర ప్రభుత్వం మొబైల్ వినియోగదారులకు త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. త్వరలో ఈ రీఛార్జ్‌కు సంబంధించిన రేట్లను కేంద్రం తగ్గించనుంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే మొబైల్ రీఛార్జ్ రేట్లకు సంబంధించిన ప్లాన్లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికర సంస్థ ట్రాయ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్‌లకు ప్రత్యేక రిఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది.

అయితే, ఈ నిర్ణయంపై వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కోరామని, ఆగస్టు 16 వరకు మొబైల్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తామని ట్రాయ్ పేర్కొంది. ఒకవేళ యూజర్ల నుంచి పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తమైతే.. రీఛార్జ్ రేట్లు భారీగా తగ్గేందుకు అవకాశం ఉంటుందని మార్కెట్లు నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా నెల రోజుల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటి తమ రీఛార్జ్ ప్లాన్‌లపై దాదాపు 11 నుంచి 12 శాతం రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇలా కంపెనీలు సడెన్‌గా రీఛార్జ్ రేట్లు పెంచడంతో చాలామంది యూజర్లు ఇతర నెట్వర్క్ పరిధిలోకి మారారు.

రీఛార్జ్ రేట్లను తొలుత జియో పెంచింది. తర్వాత దీనిని అనుసరిస్తూ ఒక్కరోజు వ్యవధిలోనే ఎయిర్‌టెల్ సైతం రేట్లను పెంచేసింది. ప్రధాన నెట్వర్క్‌లు అయిన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ రేట్లను పెంచడంతో వీఐ కంపెనీ సైతం పెంచేసింది. ఇక, బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీంతో ఇప్పటికే చాలా మంది సింగిల్ యూజర్లు, డబుల్ యూజర్లు జియో, ఎయిర్‌టెల్, వీఐ నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారారు. దాదాపు జూలైలో లక్షమందికి పైగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్‌కి మారినట్లు వెల్లడైంది. ఇంకా మరికొంతమంది మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

నంబర్ వన్ కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్‌కు మారడంతో బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ టవర్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రాసెస్ త్వరగా పూర్తయితే మరో లక్షమందికిపైగా నెట్వర్క్ మారనున్నారు.

‘కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2012 ’పై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలు తెలియజేయాలని, 23 వరకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని టెలికం సంస్థలకు ట్రాయ్ గడువు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ప్రత్యేక టారిఫ్, కాంబో ఓచర్లకు ఉన్న 90 రోజుల గరిష్ట చెల్లుబాటు కాలాన్ని పొడగించాలని ట్రాయ్ భావిస్తోంది. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే ఇంకా కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: అదరగొట్టే ఫోన్లు.. అతి తక్కువ ధరకే.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

ఇదిలా ఉండగా, టెలికాం సంస్థలు..ప్రధానంగా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను బండిల్డ్ ప్లాన్ రూపంలో ఇస్తున్నాయి. ఇందులో కొంతమంది కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలను మాత్రమే ఉపయోగించుకొని డేటాను వాడట్లేదు. దీంతో తాము ఇంటర్నెట్ వాడకుండానే రీఛార్జ్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే విడివిడిగా రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చేందుకు ట్రాక్ భావిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రీఛార్జ్ ప్లాన్స్ భారీగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×