BigTV English

Redmi 14C: దూసుకుపోతున్న రెడ్‌మి.. మరోకొత్త ఫోన్‌ రెడీ.. స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?

Redmi 14C: దూసుకుపోతున్న రెడ్‌మి.. మరోకొత్త ఫోన్‌ రెడీ.. స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే..?

Redmi 14C Launch Date: ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. ప్రతి ఒక్కరూ 5జీ నెట్‌వర్క్ కలిగిన ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం రకరకాల మోడళ్లను 5జీ నెట్‌వర్క్‌ రూపంలో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అలా వచ్చిన కొత్త కొత్త ఫోన్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు మరో బ్రాండ్ తన లైనప్‌లో ఉన్న ఓ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అది మరేదో కాదు రెడ్‌మి.


Xiaomi సబ్ బ్రాండ్ Redmi తన లైనప్‌లో ఉన్న Redmi 14C ఫోన్‌ను మార్కెట్‌లో పరిచయం చేసేందుకు రెడీగా ఉంది. చాలా కాలంగా ఈ ఫోన్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే Xiaomi సబ్-బ్రాండ్ ఈ ఫోన్ కోసం అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ దాని కంటే ముందే ఈ హ్యాండ్‌సెట్ వియత్నామీస్ రిటైలర్ వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. దాని ప్రకారం.. ఫోన్ లాంచ్ తేదీ, డిజైన్, స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. Redmi 14C స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వెనుక కెమెరాతో వస్తుంది. ఇది గతేడాది విడుదలైన Redmi 13C ఫోన్‌కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా రాబోతుంది.

Redmi 14C స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వియత్నామీస్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ Thegioididong.comలో లిస్ట్ చేయబడింది. ఇది GizmoChina ద్వారా గుర్తించబడింది. వీటి ప్రకారం.. ఈ ఫోన్ లాంచ్ తేదీ, ఇతర స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఈ ఫోన్ ఆగస్టు 31 వ తేదీన లాంచ్ చేయబడుతుందని చెప్పబడింది. అలాగే ఈ కొత్త ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్‌లలో వచ్చే అవకాశం ఉంది.


Also Read: చెమటలు పట్టిస్తున్న కొత్త ఫోన్.. కేవలం రూ.7500లకే.. 5000mAh బ్యాటరీ దీని సొంతం..!

కాగా బ్లూ కలర్ వేరియంట్ గ్రేడియంట్ ఫినిషింగ్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. వెనుక నుండి చూస్తే Redmi 14C ఫోన్ దాని ముందున్న మోడల్ Redmi 13Cకి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. బయటకొచ్చిన ఫొటోలు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉన్నట్లు చూపుతున్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో రౌండ్ టైప్ కెమెరా మాడ్యూల్, LED ఫ్లాష్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సెల్ఫీ షూటర్‌ విషయంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

కాగా Redmi 14C ఫోన్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల LCD డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి రానుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఇది AI మద్దతు గల కెమెరా యూనిట్‌తో వస్తుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రీటైలర్ లిస్టింగ్ Redmi 14Cలో ఉపయోగించిన ప్రాసెసర్ గురించి ప్రస్తావించలేదు.

అయినప్పటికీ ఇది MediaTek Helio G91 Ultra SoCని కలిగి ఉండవచ్చని ఓ నివేదిక సూచించింది. ఈ హ్యాండ్‌సెట్ 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో 4GB RAMతో ప్రామాణికంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే Redmi 13C ఫోన్ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభ ధర రూ. 7,999తో భారతదేశంలో ప్రారంభించబడింది. దీని ఆధారంగా కొత్త ఫోన్ సరసమైన ధర ట్యాగ్‌తో ప్రారంభమవుతుందని కొందరు భావిస్తున్నారు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×