BigTV English

Oracle Scam Warning: గూగుల్ వార్నింగ్.. ఐటి ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న సైబర్ దొంగలు

Oracle Scam Warning: గూగుల్ వార్నింగ్.. ఐటి ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న సైబర్ దొంగలు

Oracle Scam Warning| గూగుల్ కొత్త రకం సైబర్ దాడి గురించి పెద్ద హెచ్చరిక జారీ చేసింది. సైబర్ దొంగలు (హ్యాకర్లు) ఐటీ కంపెనీ ఉద్యోగులకు బెదిరింపు ఈమెయిల్స్ పంపుతున్నారు. ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ నుండి సున్నితమైన డేటా దొంగిలించామని ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డబ్బు చెల్లించకపోతే ఆ డేటాను బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారు. క్లాప్ రాన్సమ్‌వేర్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


హ్యాకర్లు ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు?

ఈమెయిల్స్‌లో ఒరాకిల్ సిస్టమ్స్ నుండి ఆర్థిక, ఆపరేషనల్ డేటా దొంగిలించామని సైబర్ దొంగలు చెబుతున్నారు. వారి అడిగిన డబ్బు చెల్లించకపోతే డేటాను బహిర్గతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ గూగుల్ డేటా దొంగతనానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇది కంపెనీలను భయపెట్టి డబ్బు వసూలు చేసే వ్యూహం కావచ్చు.

ఈ దాడి ఎందుకు పెద్ద ముప్పు?

ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు ఉపయోగిస్తాయి. ఈ సూట్‌లో ఫైనాన్స్, హెచ్ ఆర్, ఆపరేషనల్ డేటాను సురక్షితంగా ఉంటుందని స్టోర్ చేస్తారు. డేటా లీక్ అయితే ఆర్థిక నష్టం జరుగుతుంది. కంపెనీల పరువు దెబ్బతింటుంది. నకిలీ ఆరోపణలు కూడా ఒరాకిల్ బ్రాండ్‌ను దెబ్బతీస్తాయి. బ్రాండ్ పేరును కాపాడుకోవడానికి కంపెనీలు గతంలో ఇలాంటి హ్యాకర్లకు డబ్బు చెల్లించిన సందర్భాలున్నాయి.


క్లాప్ రాన్సమ్‌వేర్ గ్రూప్ పాత్ర

క్లాప్ గ్రూప్ పెద్ద సైబర్ దాడులకు పేరుగాంచింది. ఈ గ్రూప్ హ్యాకర్లు.. ఫిషింగ్, మాల్వేర్‌తో కార్పొరేట్ నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేస్తారు. డేటా బహిర్గతం బెదిరింపులతో బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఈ హ్యాకర్లు తమ గుర్తింపు బహిర్గతం కాకుండా వ్యూహాలు మారుస్తారు.

గూగుల్ హెచ్చరిక

గూగుల్ తన హెచ్చరికలో పూర్తి వివరాలు తెలుపలేదు. ఏ ఐటీ కంపెనీలు, ఎక్సిక్యూటివ్‌లు టార్గెట్ అయ్యారో చెప్పలేదు. దాడుల సంఖ్యను కూడా వెల్లడించలేదు. కానీ ఈ ట్రెండ్ తీవ్రమని హెచ్చరించింది. కంపెనీలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ రక్షణను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది.

హ్యాకర్ల వ్యూహం ఎలా పనిచేస్తుంది?

ఫిషింగ్ మెయిల్స్ లో బెదిరింపులే ఆయుదంగా హ్యాకర్లు పనిచేస్తారు. ఈ భయాన్ని సోషల్ ఇంజనీరింగ్‌తో మిళితం చేస్తాయి. హ్యాకర్లు నకిలీ డేటా దొంగతనం ఆరోపణలతో ఒత్తిడి చేస్తారు. కంపెనీలు తమ బ్రాండ్‌ను కాపాడుకోవడానికి డబ్బు చెల్లిస్తాయి. నిజమైన డేటా లేకపోయినా, ఈ బెదిరింపులు ప్రమాదకరం. ఇవి కంపెనీ బ్రాండ్ విశ్వాసాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి.

కంపెనీలు డేటా సెక్యూరిటీ కోసం ఇలా చేయాలి

ఉద్యోగులకు ఫిషింగ్ ఈమెయిల్స్ గుర్తించే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. నెట్‌వర్క్ సెక్యూరిటీని రెగ్యులర్‌గా టెస్ట్ చేయండి. సున్నితమైన డేటాకు ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్, బ్యాకప్‌లు ఉపయోగించండి. మల్టీ-లేయర్ సెక్యూరిటీ, జీరో-ట్రస్ట్ పాలసీలు అమలు చేయండి. అనుమానాస్పద ఈమెయిల్స్‌కు ఏ విధంగానూ స్పందించ కూడదు. బలమైన సైబర్ రక్షణలో పెట్టుబడి పెట్టండి.

 

Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Related News

Apple Watch Life save: సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదం.. యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్!

Redmi Smartphone: DSLRకే సవాల్ విసిరిన రెడ్మీ!.. 200MP కెమెరా, 8K వీడియో రికార్డింగ్

Oneplus phone 2025: వన్ ప్లస్ 13ఎస్ 5జి.. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ తో షాకింగ్ లాంచ్!

Instagram: ఇన్ స్టాగ్రామ్ మీ మాటలు విని యాడ్స్ ఇస్తుందా? ఆ సంస్థ హెడ్ ఏం చెప్పారంటే?

Microsoft Windows 10: విండోస్ 10 యూజర్లకు అలర్ట్.. అక్టోబర్ 14 లాస్ట్ డేట్

Infinix Hot 50 Ultra 2025: ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా రూ. 10వేల లోపే

Reno 13 Pro 5G: రెనో 13 ప్రో.. ప్రతి ఫోటో ప్రొఫెషనల్ లుక్.. అమోలేడ్ డిస్‌ప్లే సినిమాల ఫీలింగ్

Big Stories

×