BigTV English

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ గా ప్రారంభమైన ఈ షో మొదట హిందీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్కడ ఏకంగా 18 సీజన్లు పూర్తిచేసుకుని.. 19వ సీజన్ కూడా ప్రారంభం అయింది. అక్కడ తొలి సీజన్ కి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ షో ని ఆదరించడంతో వివిధ భాష ఇండస్ట్రీలలో కూడా ఈ షోని నిర్వహించడం మొదలుపెట్టారు. ఎక్కువగా సినీ సెలబ్రిటీలు, బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు ఇప్పుడు కామనర్స్ కూడా హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు.


సడన్గా పడిపోయిన రీతూ చౌదరి..

ఈ క్రమంలోనే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇప్పటికే మూడు వారాలు పూర్తికాగా.. నాలుగవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ ఎపిసోడ్ తాజాగా వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. 26వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ టాస్క్ కోసం చేసిన రెయిన్ డాన్స్ ఆకట్టుకుంది. లాస్ట్ లో రీతూ చౌదరి సడన్గా పడిపోవడంతో కంటెస్టెంట్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

తాజా ప్రోమోలో ఏముందంటే?

ప్రోమో విషయానికి వస్తే.. కళ్యాణ్, ఇమ్మానుయేల్, రాము రాథోడ్ , రీతు చౌదరి ఇప్పుడు మీలో ఒకరు మాత్రమే ఇంటికి నాలుగో కెప్టెన్ అవ్వగలరు. అది ఎవరో తెలుసుకోవడానికి బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ రెయిన్ డాన్స్. అంటూ టాస్క్ వివరించార. ఇక బజర్ మోగగానే ఎదురుగా ఉన్న గంటను ఎవరైతే ముందుగా తీసుకుంటారో.. వారు రెయిన్ డాన్స్ చేయాలి. అలా బజార్ మోగగానే డిమోన్ పవన్ గంట తీసుకొని రెయిన్ డాన్స్ చేశారు. బిగ్ బాస్ మాట్లాడుతూ..మ్యూజిక్ ఆగిపోయే లోపు కంటెండర్స్ బ్లూ స్క్వేర్ లోకి ఈ స్టాండ్ ను పుష్ చేయలేక పోతే డాన్స్ చేస్తున్న ఇంటి సభ్యులు కంటెండర్స్ లో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి అంటూ టాస్క్ గురించి పూర్తిగా వివరిస్తారు. అయితే మ్యూజిక్ ఆగిపోయేలోపు కంటెండర్స్ ఆ స్క్వేర్ ని బ్లూ స్క్వేర్ లోకి మార్చలేకపోతారు. దాంతో పవన్.. కళ్యాణ్ ను రేస్ నుంచి తప్పిస్తారు. అయితే రీతు చెప్పడం వల్లే కళ్యాణ్ ను పవన్ రేస్ నుంచి తప్పించినట్లు స్వయంగా రీతు కళ్యాణ్ దగ్గరకు వెళ్లి చెప్పి సారీ చెబుతుంది.


ఆందోళనలో కంటెస్టెంట్స్..

ఆ తర్వాత శ్రీజ ఇమ్మానియేల్ ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది. మూడవ రౌండ్ లో భరణి శంకర్ డాన్స్ చేశారు. ఇక లాస్ట్ లో స్క్వేర్ బాక్స్ లోకి స్టాండ్ ను ఎవరైతే మూవ్ చేస్తారో వారే విజేత అంటూ ప్రకటించగా.. అటు రీతు చౌదరి ఆ స్టాండ్ ని మూవ్ చేయలేక సడన్గా పడిపోతుంది. దీంతో అటు కంటెస్టెంట్స్ లో కూడా ఆందోళన మొదలైంది.. మరి ఆమెకు ఏమైందో తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

ALSO READ: Mouni Roy హైటెక్ సిటీలో సందడి చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!

Related News

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Big Stories

×