BigTV English

Drugs seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, మార్కెట్‌లో విలువ 8.5 కోట్లు.. అదుపులో ముగ్గురు..

Drugs seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, మార్కెట్‌లో విలువ 8.5 కోట్లు.. అదుపులో ముగ్గురు..

Drugs seized: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి ప్రాంతంలో భారీగా డ్రగ్స్ సీజ్ పోలీసులు. మార్కెట్ లో దీని విలువ అక్షరాలా దాదాపు 8.5 కోట్లు. స్వాధీనం చేసుకున్నది ఎఫిటమిన్ డ్రగ్. ఈ స్థాయిలో పట్టుబడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి.


డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. దేశ విదేశాల నుంచే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ వస్తోంది. ఇక్కడి నుంచే మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతోంది. దీంతో డ్రగ్స్ కదలికలపై పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు.

ఇప్పటివరకు డ్రగ్స్‌తో పట్టుబడిన నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు.  దీని ఆధారంగా చేసుకున్న మిగతా ప్రాంతాల్లో మాటు వేశారు. ఇందులోభాగంగా సోమవారం ఎఫిటమిన్ డ్రగ్‌ని బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర వైపు కారులో తరలిస్తున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగేశారు అధికారులు. కారుతోపాటు డ్రగ్స్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.


ALSO READ: ‘రూ.5 వేలకే అందమైన యువతి’.. ఒక మహిళ ఎలా మోసపోయిందంటే..

నిందితుల నుంచి కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిలో ఓ డ్రగ్ ఫెడ్లర్‌ ఉన్నాడు. మార్కెట్‌లో దీని విలువ దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు. ఎఫిటమిన్ డ్రగ్ ఈ స్థాయిలో పట్టుబడడం ఏడాదిలో ఇదే తొలిసారి.

డ్రగ్ ఫెడ్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్‌లో కీలకమైన డేటా లభ్యమైనట్టు సమాచారం. ఈ డ్రగ్‌ని ఎక్కడి నుంచి సిటీకి తీసుకొచ్చారు? హైదరాబాద్ నుంచి ఏయే ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు? అనేదానిపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుల నుంచి లభ్యమైన కీలక డేటాను విశ్లేషించే పనిలోపడ్డారు అధికారులు.

మరోవైపు రాజేంద్రనగర్ పోలీసులు బండ్లగూడలో డ్రగ్స్ సీజ్ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వీటిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ని విక్రయిస్తున్న వారిలో ఓ జంటతోపాట మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.

మహిళ అరెస్ట్ కాగా, మరో నలుగురు పరారీ ఉన్నారు. దంపతులతోపాటు వీరంతా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. సన్ సిటీని అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందాకు తెరలేపినట్టు సమాచారం.

 

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×