woman safe under the Goods train by protect her life in Vikarabad.. video viral: జీవితం పై విరక్తితో ఉన్నప్పుడు రైలు పట్టాల మీద పడుకుని ప్రాణాలు తీసుకునేవారు ఉంటారు కొందరు. కానీ ఓ యువతి రైలు పట్టాలు దాటే క్రమంలో ఒక్కసారిగా వచ్చేసిన గూడ్స్ రైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె పట్టాలపై నిలువుగా పడుకుంది. ఆమెపైనుంచి గూడ్స్ బండి వెళ్లింది. పట్టాల మధ్య ఆమె మాత్రం సురక్షితంగా బయటపడింది. ఆమెకు ఇంత కూడా గాయం కాలేదు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ హడావిడిగా రైల్వే ట్రాక్ దాటుతోంది. అయితే ఒక ట్రాక్ ఎలాగోలా దాటేసింది. రెండో ట్రాక్ దాటే క్రమంలో తాండూరు నుంచి సేడం వైపు వెళ్లే గూడ్స్ రైలు అత్యంత వేగంగా దూసుకువచ్చింది. అయితే తప్పించుకునే మార్గం లేక ఆ మహిళ తెలివిగా పట్టాలపై నిలువుగా పడుకుని తన ప్రాణాలను కాపాడుకోగలిగింది.
సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్
పైనుంచి ఫోర్స్ గా వెళుతున్న గూడ్స్ రైలు..విపరీతమైన చప్పుడు..భయాందోళన మరో పక్క..ఏ మాత్రం శరీరం కదిలించినా రైలు చక్రాల కింద నుజ్జు కావడం ఖాయం. అయితే ఆ మహిళ పట్టాలపై బోర్లా పడుకుంది. ఆఖరి పెట్టె వెళ్లేంతవరకూ తన ప్రాణాలను ఉగ్గపట్టుకుని అలాగే పడుకుంది. ఈ దృశ్యాన్ని చూసి స్టేషన్ లో కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. రైలు వెళ్లిపోగానే ఆ మహిళ ధైర్యంగా లేచి నిలబడి సురక్షితంగా బయటపడింది. దీనితో అక్కడే ఉన్న ప్రయాణికులు ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసించారు. ఎంతో గొప్ప ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటేనే ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడగలం. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచనకు అందరూ అభినందనలు తెలుపుతుంటే..మరి కొందరు మాత్రం ఆ మహిళను పట్టాలు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని దాటాలంటూ క్లాసులు పీకుతున్నారు. ఏది ఏమైనా ఆమెను అంతా బ్రేవ్ వుమెన్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వికారాబాద్ జిల్లా:
మహిళకు తప్పిన ప్రమాదం. బషీరాబాద్ మండలం నావంగి రైల్వే స్టేషన్లో అగి ఉన్న గూడ్స్ రైలు. గూడ్స్ రైలు మధ్యలో నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నం.ముగ్గురిలో ఇద్దరు దాటగా అప్పుడే కదిలిన ట్రైన్.మహిళ పట్టాల మధ్యలో ఉండడంతో అక్కడే ఉన్న మరి కొందరు ప్రయాణికులు మహిళలు పట్టాలపై… pic.twitter.com/XNXCheu2l3
— ChotaNews (@ChotaNewsTelugu) August 25, 2024