BigTV English

Realme Note 60: చెమటలు పట్టిస్తున్న కొత్త ఫోన్.. కేవలం రూ.7500లకే.. 5000mAh బ్యాటరీ దీని సొంతం..!

Realme Note 60: చెమటలు పట్టిస్తున్న కొత్త ఫోన్.. కేవలం రూ.7500లకే.. 5000mAh బ్యాటరీ దీని సొంతం..!

Realme Note 60: చాలా మంది ఫోన్ ప్రియులు ఈ మధ్య అధిక ఫీచర్లు, కెమెరా క్వాలిటీ గల ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సెర్చ్ చేస్తున్నారు. అదే క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీలు సైతం రోజుకో కొత్త మోడల్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు తమ ఫోన్లలో అధునాతన ఫీచర్లు అందిస్తున్నాయి. అందులో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రెడ్‌మి ఒకటి.


ఈ కంపెనీ సామాన్యులకు అందుబాటు ధరలో అధిక ఫీచర్లు గల ఫోన్‌లను లాంచ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో Realme Note 60 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, డిజైన్ తదితర ప్రధాన స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి.

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ Realme Note 50కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా రాబోతుంది. ఈ Realme Note 60లో 6.74 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక వైపు 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతుంది. దీనికి IP64 రేటింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉంది. కాగా Realme Note 60 కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లు దాని లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి.


Also Read: 50MP ఫ్రంట్ కెమెరా, 5800mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కొత్త ఫోన్..!

దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. దాని ప్రకారం.. Realme Note 60 స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HD+ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో రెయిన్‌ వాటర్ టచ్ ఫీచర్ కూడా అందించబడింది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 32 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో 10x డిజిటల్ జూమ్ ఫీచర్ కూడా ఉంటుంది. సెకండరీ సెన్సార్ వివరాలు తెలియరాలేదు.

అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అమర్చబడుతుంది. ఫోన్ బ్లాక్ అండ్ బ్లూ కలర్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇక బాడీ, డిజైన్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌లో రావచ్చు. ఫోన్‌లో Unisoc T612 చిప్‌సెట్ ఉంటుంది. దానితో 4GB RAM లేదా 6GB RAM జత చేసే అవకాశం ఉంది. అలాగే 64 GB లేదా 128GB స్టోరేజ్‌ని అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 10W ఛార్జర్ సపోర్ట్‌తో పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది.సేఫ్టీ కోసం ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని అందించే అవకాశం ఉంది.

ఇక దీని ధర విషయానికొస్తే.. 4GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ఇండోనేషియాలో Rp 1,399,000 (సుమారు $90 లేదా సుమారు రూ. 7,500)కి లిస్ట్ చేయబడింది. అదే సమయంలో ఫోన్ 6GB/128GB మోడల్ Rp 1,599,000 (సుమారు $103 లేదా సుమారు రూ.8,600)గా ఉంది. ఈ ఫోన్ త్వరలో ఇండోనేషియాలో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×