Tilak Verma : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్లు శుబ్ మన్ గిల్, అభిషేక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ తొందరగా ఔట్ అయినప్పటికీ క్రీజులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో తిలక్ వర్మ రాత్రికి రాత్రి చాలా ఫేమస్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సిరాజ్ కి డీఎస్పీ పదవీ ఇచ్చినట్టుగానే.. తిలక్ వర్మకు కూడా డీఎస్పీ పదవీ ప్రభుత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : BANW Vs PAKW : బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఓటమి… ఉమెన్స్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టిక ఇదే
ఈ నేపథ్యంలో తిలక్ వర్మ.. ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత తిరిగి భారత్ చేరుకోగానే మరుసటి రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి బ్యాట్ కూడా గిప్ట్ ఇచ్చాడు. దీంతో తిలక్ వర్మ కి కూడా సీఎం రేవంత్ రెడ్డి డీఎస్పీ పదవీ అప్పగిస్తాడా..? అని సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. తిలక్ వర్మ తెలుగు వారి కీర్తిని పైకి ఎగురవేశారని.. తెలుగు ప్రజల, భారత దేశ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు కాబట్టి తిలక్ వర్మకు డీఎస్పీ పదవీ ఇవ్వాలని ఓ మహిళా మీడియా ప్రతినిధితో మాట్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు బార్బడోస్ లో భారత జట్టు టీ-20 వరల్డ్ కప్ విజయం తరువాత టీ-20 జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సిరాజ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్ ని అభినందించి.. అతనికి డీఎస్పీ పదవీ అప్పగించాడు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సిరాజ్ సాధించిన విజయాలు.. అతని ప్రతిభ, వరల్డ్ కప్ విజయంలో భారత పాత్రను హైలెట్ చేశారు. డీఎస్పీ పదవీని పొందవచ్చని సీఎం తెలపడంతో.. అతను డీఎస్పీ గా కూడా బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ వేసి మ్యాచ్ ని డ్రాకి తీసుకువచ్చాడు. టెస్ట్ సిరీస్ కోల్పోతుందనుకున్న సమయంలోనే అద్భుతమైన బౌలింగ్ తో సత్తా చాటాడు. అలాగే ప్రస్తుతం వెస్టిండిస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా సిరాజ్ 4 వికెట్లు తీశాడు. 5వ వికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ 5వ వికెట్ సిరాజ్ కి దక్కలేదు.
?igsh=OGV5Y3M4NXlrNnkw