Samsung EV Battery| ఎలిక్ట్రిక్ వాహనాల బ్యాటరీ రంగంలో ఓ విప్లవం రాబోతోంది. శామ్ సంగ్ కంపెనీ కనీవినీ ఎరుగని టెక్నాలజీతో స్పెషల్ బ్యాటరీ తీసుకురాబోతోంది. ఆ బ్యాటరీ మార్కెట్ లోకి వస్తే.. ఇక రోడ్లపై సౌండ్ లేకుండా అన్నీ ఎలెక్ట్రిక్ వాహనాలే. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఎలెక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ బ్యాటరీలు ఎక్కువ కిలోమీటర్లు మైలేజి ఇవ్వలేవు. పైగా బ్యాటరీ చార్జింగ్ కోసం గంటల తరబడి సమయం పడుతుంది. అందుకే ఎలెక్ట్రిక్ కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే శామ్ సంగ్ కంపెనీ.. ఒకసారి చార్గింగ్ చేస్తే.. దాదాపు వేయి కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే బ్యాటరీని లాంచ్ చేయనుంది.
వేయి కిలోమీటర్లంటే మామూలు విషయం కాదు. దక్షిణ కొరియా కంపెనీ అయిన శామ్ సంగ్ ఇప్పటికే పలు టెక్నాలజీ ఎగ్జిబిషన్ లల ఈ బ్యాటరీని ప్రదర్శించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. ఫుల్ చార్జింగ్ తో కారు 965 కిలో మిటర్లు ప్రయాణిస్తుంది.
సియోల్ లో స్పెషల్ బ్యాటరీ షో
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఇటీవల శామ్ సంగ్ కంపెనీ ఎస్ఎన్ఈ బ్యాటరీ డే 2024 ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ బ్యాటరీ షో లో కొత్త బ్యాటరీ గురించి వివరిస్తూ.. సాలిడ్ స్టేట్ ఆక్సైడ్ అనే టెక్నాలజీతో కొత్త బ్యాటరీ తయారు చేశామని శామ్ సంగ్ శాస్త్రవేత్తులు వివరించారు. బ్యాటరీ జీవితకాలం 20 ఏళ్లు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బ్యాటరీలు మహా అయితే ఆరు లేదా ఏడేళ్ల వరకు పనిచేస్తాయి. అంటే శామ్ సంగ్ సాలిడ్ బ్యాటరీ ప్రస్తుత బ్యాటరీల కన్నా మూడు రెట్లు ఎక్కువ మన్నిక కలదు. 9 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ చేసేందుకు 480 kW లేదా 600 kW చార్జర్ అవసరమవుతుంది.
సాలిడ్ స్టేట్ ఆక్సైడ్ టెక్నాలజీ వివరాలు..
సాలిడ్ స్టేట్ ఆక్సైడ్ టెక్నాలజీ ఇప్పుడున్న లిథియమ్ ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనచుట్టూ ఉన్న ఎలెక్ట్రానిక్స్.. అంటే స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్, ఎలెక్ట్రానిక్స్, ఈవీ స్కూటర్స్, ఈవీ కార్లు అన్నింటిలో లిథియమ్ ఐయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నాం. లిథియమ్ ఐయాన్ బ్యాటరీలో లిక్విడ్ ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి. అంటే ఇదొక ధ్రవ పదార్థం. అందుకే చాలాసార్లు ఈ బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు చాలా జరిగాయి. బ్యాటరీ ఉబ్బిపోవడంతో ఫోన్ లు పేలిపోతుంటాయి.
లిథియమ్ ఐయాన్ బ్యాటరీ సమస్యలను పరిష్కిరంచడానికి శామ్ సంగ్ శాస్త్రవేత్తలు.. సాలిడ్ స్టేట్ బ్యాటరీపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. అయితే ఈ బ్యాటరీలో పేలిపోయే ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ధ్రవ పదార్థం బదులు సాలిడ్ ఎలెక్ట్రానిక్స్ ఉండడంతో ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటాయి. పైగా ఈ బ్యాటరీ బరువు చాలా తక్కువగా ఉంటుంది. బ్యాటరీ సైజు కూడా చిన్నది. ఎలెక్ట్రిక్ కార్లు.. బ్యాటరీలతోనే ఎక్కువ బరువుగా ఉంటాయి. అందుకే ఈ కొత్త బ్యాటరీ కార్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు.
Also Read: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా