EPAPER

Google Pixel 9: అబ్బురపరిచే గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌.. ధర ఎంతో తెలుసా?

Google Pixel 9: అబ్బురపరిచే గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌.. ధర ఎంతో తెలుసా?

Google Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL Rates in Market: భారత మార్కెట్‌లోకి ప్రముఖ గూగుల్ కంపెనీ నుంచి పిక్సెల్ 9 సిరీస్ వచ్చేసింది. గూగుల్ కంపెనీ.. సరికొత్త ఏఐ ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ ప్రో ఎక్స్ఎల్ ఫోన్లను భారత్ మార్కెట్‌లో లాంఛ్ చేసింది. ఇటీవల జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈ వెంట్‌లో ఈ ఫోన్లను ఆవిష్కరించింది.


గూగుల్ కంపెనీ ఇప్పటికే పలు ఫోన్లను లాంఛ్ చేయగా.. ఈ సారి సరికొత్తగా ఏఐ ఫీచర్లతో కూడిన ఫోన్లను విడుదల చేసింది. దీంతో మొబైల్ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. కాగా, ఈ స్మార్ట్ ఫోన్లల్లో కొత్త టెన్సర్ జీ4 ఎస్‌ఓసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ అమర్చారు. అలాగే ఈ మూడు ఫోన్లు వాటర్, డస్ట్ వంటి రెసిస్టెన్స్ ఫీచర్‌, రిఫ్రెష్ రేటింగ్ ఐపీ68 ను కలిగి ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను కస్టమర్స్‌కు దగ్గర చేసేందుకు గూగుల్ కంపెనీ..గూగుల్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభించనుంది. గూగుల్‌లోని మూడు వాక్ ఇన్ సెంటర్లను ప్రారంభించగా.. మొత్తం 15 నగరాల్లోని 150 రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాలులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ప్రీ ఆర్డర్స్ కోసం బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.


గూగుల్ పిక్సెల్ 9..
గూగుల్ పిక్సెల్ 9 ధర రూ.79.999గా ఉండగా.. స్టోరేజీ 12జీబీ ర్యామ్, 256 జీబీగా ఉంది. ఈ ఫోన్ పియోనీ, పింగాణీ, అబ్సిడియన్, వింటర్ గ్రీన్ కలర్స్‌లో లభించనున్నాయి. ఈ ఫోన్ ఫిచర్ల విషయానికొస్తే.. పిక్సెల్ 9 డిస్ ప్లే 6.3 అంగుళాలు ఉండగా..120హెడ్జ్ రిఫ్రెస్ రేట్, 2,700 నిట్స్ బ్రైట్ నెస్, టెన్సార్ జీ4 ఎస్ఓసీ వవర్డ్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ అమర్చారు.

ఈ ఫోన్ బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పనిచేస్తుంది.10.5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ 4,700 ఎంఏహెచ్, 45 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, క్యూఐ వైర్ లెస్ సపోర్ట్ ఉంది.

Also Read: కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. ఒప్పో నుంచి ఫైండ్ ఎక్స్8, ఎక్స్ 8 ప్రో లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు హైలైట్..!

గూగుల్ పిక్సెల్ 9 ప్రో, ఎక్స్ఎల్..
పిక్సెల్ 9 ప్రో ఫోన్ ధర రూ.1,09,999 ఉండగా.. స్టోరేజీ 16జీబీ ర్యామ్, 256 జీబీగా ఉంది. ఈ ఫోన్ హాజెల్, పింగాణీ, రోజ్ క్వార్ట్జ్, అబ్సిడియన్ కలర్స్‌లో ఉంటాయి. ఫీచర్లలో పిక్సెల్ 9 ప్రో రిఫ్రెష్ రేట్ 120 హెడ్జ్, బ్రైట్‌నెస్ 3,000నిట్స్, డిస్ ప్లే 6.3 అంగుళాల సూపర్ ఆక్యూఓ ఎల్ఈడీగా ఉన్నాయి. పిక్సెల్ 9 ప్రో మ్యాక్ ధర విషయానికొస్తే.. రూ.1,24,99గా ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ 16 జీబీర్యామ్, 256 జీబీగా ఉంది. పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ 6.8 అంగుళాల సూసర్ ఆక్టువా ఓఎల్ ఈడీ డిస్ ప్లేతో తయారైంది.

అయితే పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్ ఫోన్లలలో ఓకే మాదిరిగా ఫిచర్లు ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. గరిష్టంగా 30రెట్లు సూపర్ రెస్ జూమ్, 5 రెట్లు ఆప్టికల్ జూమ్ తో 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 42 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8కే క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. పిక్సెల్ 9 ప్రో కెపాసిటీ 4,700 ఎంఏహెచ్ కాగా, పిక్సెల్ ప్రో ఎక్స్ఎల్ 5,060 ఎంఏహెచ్ గా ఉంది. ఈ రెండు ఫోన్లు 45 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, క్యూఐ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×