Shivaji in Hailesso Movie: జబర్దస్త్ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు సుధీర్. కమెడియన్ మంచి గుర్తింపు పొందిన సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరో రేంజ్ లో ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుధీర్.. టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అంతకు ముందు సాప్ట్వేర్ సుధీర్, సుడిగాలి సుధీర్, అల్లరోడు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఇందులో మంచి హిట్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. కమెడియన్, టీవీ హోస్ట్ గా మెప్పించిన సుధీర్.. హీరోగానూ ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు.
ఈసారి చిన్న సినిమా కాకుండా ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే లైన్లో పెట్టాడు. అదే హైలెస్సో మూవీ. ఇటీవల టైటిల్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. సుధీర్ ఐదో చిత్రంగా వస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మూవీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. కాన్సెప్ట్ పోస్టర్ గా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ పుష్ప 2 రేంజ్ లో డిజైన్ చేశారు. అమ్మవారి జాతర నేపథ్యంలో అమ్మవారి అవతారంలో హీరో లుక్ ని షేర్ చేశారు. అయితే ఇందులో కాలుకి మెట్టలు, కడియంతో కనిపించాయి. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకుంటుంది.
ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమా నటుడు, బిగ్ బాస్ ఫేం శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మూవీ టీం ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే.. ఆయనది విలన్ రోల్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా శివాజీనే చెప్పాడు. ఈ మేరకు డైరెక్టర్ తో ఈ సినిమాలోని తన పాత్ర గురించి చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర మంగపతి అమ్మ మొగుడి మించి ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ కుమార్ హైలెస్సో అనే సినిమా చేస్తున్నారు.. నేను ఆ సినిమాకి మంగపతి అమ్మ మొగుడిని అంటూ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ హైప్ పెంచిన హైలెస్సో మూవీకి ఇప్పుడు శివాజీ విలన్ తెలిసి మరింత బజ్ పెరిగింది.
Also Read: Bigg Boss 9 Winner: విన్నర్ ఎవరో చెప్పేసిన హైపర్ ఆది.. ఈసారి టైటిల్ ఆమెదే, టాప్ 5లో రీతూ పక్కా
Stronger & Impactful than Ever 🥵🔥
Actor #Sivaji Gaaru Playing a Prominent Role in #HaiLesso Film ❤️🔥💥💥
Can't Wait 🙌👌@sudheeranand #SS5 pic.twitter.com/PO91PpAgsj
— Sudheer Trends™ (@TrendsSudheer) October 20, 2025
అది మంగపతి రోల్ ని మించి ఉంటుందని చెప్పడంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. కాగా ఇటీవల విడుదలైన కోర్టు మూవీలో మంగపతిగా శివాజీ రోల్ ఏ రేంజ్ లో ఉందో చూశారు. ఇంటి పెద్దగా ఆడపిల్లను కట్టడి చేసే మంగపతి పాత్ర ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటి తన సినీ కెరీర్ ఆయన చేసిన చేసిన సినిమాలు ఒక ఎత్తయితే కోర్టులో మంగపతి రోల్ ఒక ఎత్తు. అంతగా ఆయనకు ఈ రోల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు హైలెస్సో లో దానికి మించిన రోల్ అని చెప్పడంతో అంత అంచాల్లో మునిగితేలుతున్నారు. కుమార్ కోట దర్శకత్వం వహిస్తుండగా.. శివ చెర్రి, రవికిరణ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నటషా సింగ్, నక్ష శరన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్ బాస్ శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర తారగణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.