Mahesh Babu -Sandra: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలతో పాటు బుల్లితెర నటినటుల పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే మరి కొంతమంది సెలబ్రిటీలు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వబోతున్నట్లు శుభవార్తలను తెలియజేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు కాళిదాసు (Mahesh Babu Kalidas)కూడా ఒకరు. అయితే ఈయన మరొక బుల్లితెర నటి సాండ్రా జయచంద్రన్ (Sandra Jayachandran)అనే నటితో ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా వీరిద్దరూ సమ ప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేయడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఈ జంట స్పందిస్తూ తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ మరొక శుభవార్తను తెలియజేశారు. ఇక ఈ జంట ఇది వరకే శ్రీశైలంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం (Engagment) జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరు తమ పెళ్ళి తేదీని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అతి త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియోలో ఈ జంట మాట్లాడుతూ నిజానికి మా పెళ్లి శ్రావణ మాసంలో జరగాల్సి ఉంది అయితే అప్పుడు మా సీరియల్స్ షూటింగ్ డేట్స్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే మాకు సంబంధించి ఏదో ఒక చిన్న శుభకార్యం శ్రావణమాసంలో జరగాలన్న ఉద్దేశంతోనే మా నిశ్చితార్థాన్ని శ్రీశైలంలో జరుపుకున్నామని తెలిపారు. కోరుకున్న విధంగానే మా పెళ్లి కార్తీక మాసంలో జరగబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. రెండు మూడు పెళ్లి తేదీల గురించి అడగడంతో మా జాతకాలను బట్టి ఒకే పెళ్లి ముహూర్తం వచ్చిందని తెలిపారు.
కార్తీక మాసంలో అక్టోబర్ 31వ తేదీ తమ వివాహం జరగబోతుందని తాజాగా ఈ జంట తమ పెళ్ళి తేదీని ప్రకటించారు. అయితే ఈ తేదీ మాకు చాలా ప్రత్యేకమని కూడా తెలిపారు. అదే రోజు నటుడు మహేష్ బాబు కాళిదాసు పుట్టినరోజు కావటం విశేషం. ఇలా మా పెళ్లి తేది నా పుట్టినరోజు ఒకేసారి కావడంతో తనకోసమే నేను పుట్టానని ఇప్పుడే అర్థమైంది అంటూ ఈ జంట తమ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా మా పెళ్ళికి మీ ఆశీర్వాదాలు మాకు కావాలి అంటూ అభిమానులను కోరారు. ఇలా వీరిద్దరూ తమ పెళ్లి తేదీని ప్రకటించడంతో అభిమానులు కూడా ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
Also Read: Allu Shirish: కాబోయే భార్యతో అల్లు శిరీష్ దీపావళి సెలబ్రేషన్స్…ఫోటోలు వైరల్!