EPAPER

iPhone Price Drop: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా.. దేవుడా..!

iPhone Price Drop: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా.. దేవుడా..!

iPhone 15, iPhone 15 Plus get massive discounts: ఐఫోన్లంటే అందరికీ ఇష్టమే. మార్కెట్‌లోకి కొత్త సిరీస్ వచ్చిందంటే చాలు కొనేందుకు ఎగబడిపోతారు. ఇప్పటికి మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలో ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కు ముందు ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లపై అయిదిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ విజయ్ సేల్స్ ఈ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.


iPhone 15 Price Drop:

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ విజయ్ సేల్స్‌లో ఇండిపెండెన్స్ డే సేల్ కొనసాగుతుంది. ఇందులో iPhone 15, iPhone 15 Plus ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు పొందొచ్చు. ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. iPhone 15 ఫోన్‌లోని 128GB వేరియంట్ అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై భారీ తగ్గింపు లభిస్తుంది. ఆ తగ్గింపుతో దీనిని కేవలం రూ.69,690కే కొనుక్కోవచ్చు. అదే సమయంలో కొనుగోలుదారులు ICICI బ్యాంక్ లేదా SBI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుక్కునే వారు రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌తో ఐఫోన్ 15 మొబైల్‌ను కేవలం రూ.65,690లకే సొంతం చేసుకోవచ్చు.


iPhone 15 Plus Price Drop:

Also Read: కిర్రాక్ డిస్కౌంట్స్.. ఐఫోన్‌, శాంసంగ్, పిక్సెల్, మోటో ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

iPhone 15 ఫోన్‌తో పాటు iPhone 15 ప్లస్‌పై సూపర్ డూపర్ తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 15 ప్లస్‌లోని 128GB వేరియంట్‌ లాంచ్ సమయంలో రూ. 89,900కి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. ఆ తగ్గింపుతో దీనిని రూ. 77,190కి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.4,000 అదనపు తగ్గింపు పొందొచ్చు. దీంతో iPhone 15 Plus ను రూ. 73,190కి సొంతం చేసుకోవచ్చు.

iPhone 15 Specifications:

ఐఫోన్ 15 ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 2000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ పాత ఐఫోన్ మోడళ్లలో కనిపించే ట్రెడిషనల్ నాచ్ ప్లేస్‌లో కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో అందించే కొత్త టెక్నాలజీ వినియోగదారులు వారి ఐఫోన్‌లతో ఇంటరాక్ట్ కావడానికి మరింత అద్భుతమైన పనితీరు అనుభవాన్ని అందిస్తుంది. ఐఫోన్ 15 మెరుగైన కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో 48MP ప్రైమరీ కెమెరా, వేగవంతమైన ఆటోఫోకస్ కోసం 100 శాతం ఫోకస్ పిక్సెల్‌లను కలిగి ఉంది. ఇది 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్‌ను ఉపయోగిస్తుంది.

iPhone 15 Plus Specifications:

iPhone 15 Plus ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఫోటోగ్రఫీ ఔత్సాహికులు అధునాతన కెమెరా సిస్టమ్‌ను పొందుతారు. ఇందులో 48MP, 12MP లెన్స్‌లతో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ అందించబడింది. అలాగే అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6-కోర్ ప్రాసెసర్‌తో A16 బయోనిక్ చిప్‌తో ఆధారితం అయింది. అందువల్ల ఐఫోన్ ను తక్కువ ధరలో ఒక మంచి డిస్కౌంట్‌తో కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయం.

Related News

WhatsApp Scam: వాట్సాప్ లో నయా స్కామ్, ఇలా చేశారో అంతే సంగతులు!

Google Maps parking: గూగుల్ మ్యాప్స్‌లో కారు పార్కింగ్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?..

Social Media problems : సంసారంలో సోషల్ మీడియా తిప్పలు – భార్యభర్తలను విడదీస్తున్న సామాజిక మాధ్యమాలు!

Apple M4 MacBook : త్వరలోనే మరో ఆపిల్ ఈవెంట్.. మాక్ బుక్ ప్రో, మాక్ మినీ, ఐమాక్ లాంఛిగ్ ఎప్పడంటే!

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Big Stories

×