Jayammu Nischayammuraa: టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్ షో కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటుడిగా కొనసాగుతూనే మరోవైపు జయమ్ము నిశ్చయమురా(Jayammu Nischayammuraa) అనే కార్యక్రమాన్ని కూడ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమానికి సీనియర్ నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) హాజరు కాబోతున్నట్టు తాజాగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా రమ్యకృష్ణ జగపతిబాబు మధ్య సరదా సంభాషణ కొనసాగింది. రమ్యకృష్ణ లాంటి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కారు కోసం ఎదురు చూస్తుంటే ఎవరైతే ఎక్కించుకోరు అంటూ జగపతిబాబు మాట్లాడటంతో వెంటనే రమ్యకృష్ణ నువ్వు అందరి హీరోయిన్ల విషయంలో చాలా దయ చూపిస్తావు అంటూ మాట్లాడటంతో వెంటనే జగపతిబాబు షాక్ అయ్యారు.
ఇక నీ విషయంలో చాలామంది చిన్నప్పటినుంచి సైట్ కొట్టడం, ప్రేమించడం, నీకోసం కిందపడి దొర్లే వారట కదా అంటూ జగపతిబాబు అడగడంతో వెంటనే రమ్యకృష్ణ నువ్వు కూడా కదా అంటూ జగపతిబాబు పరువు మొత్తం తీసేసింది. ఇలా జగపతిబాబు ఏం మాట్లాడినా రమ్యకృష్ణ తనకే కౌంటర్ ఇస్తూ ఎంతో హంగామా చేశారని ఈ ప్రోమో చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది.
ఇక రమ్యకృష్ణ జగపతిబాబు కాంబినేషన్లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక్కడ రమ్యకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగే సమయంలోనే విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పటికి కూడా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు బాహుబలి సినిమా ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. పలు సినిమాలలో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Mahesh Babu -Sandra: పెళ్లి తేదీ అనౌన్స్ చేసిన నటుడు మహేష్ బాబు.. ఎంతో స్పెషల్ అంటూ!