E-Paper
Advertisement

Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే

Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే

BANK OF BARODA: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. బ్యాంక్ ఆప్ బరోడా నుంచి నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, డిప్లొమా, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (BANK OF BARODA )లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అక్టోబర్‌ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (BANK OF BARODA )లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఉద్యోగాలు – వెకెన్సీలు..

1. మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌): 01 పోస్టు
2. సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌): 25 పోస్టులు
3. చీఫ్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌): 02 పోస్టులు
4. సీనియర్ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్‌: 16 పోస్టులు
5. చీఫ్‌ మేనేజర్‌ సీ & ఐసీ రిలేషన్‌షిప్‌మేనేజర్‌: 06  పోస్టులు

విద్యార్హత:  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, డిప్లొమా, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 10

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 30

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు  25 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. నెలకు మేనేజర్‌కు రూ.64,820 – రూ.93,960 జీతం ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు రూ.85,920 – రూ.1,05,280 జీతం ఉంటుంది. చీఫ్ మేనేజర్‌కు రూ.1,02,300 – రూ.1,20,940 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు  ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bankofbaroda.bank.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం వెకెన్సీ సంఖ్య: 50

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 30

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×