Smart Watches: మనం ప్రతిరోజూ పరుగులు పెట్టే ఈ వేగమైన జీవితంలో, మన ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెట్టుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా, మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయం చేసే చిన్న పరికరం మన చేతికే కట్టుకోవచ్చు. అవును, నేను చెప్పేది స్మార్ట్‌వాచ్‌ల గురించి — అంటే, మన ఆరోగ్య పరిస్థితులను ట్రాక్ చేసే ఆధునిక చేతి గడియారాలు.
స్మార్ట్ వాచెస్ ధరించడం వల్ల ఆరోగ్యానికి ఏమి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం..
మొదటగా, ఇవి మన శారీరక శ్రమను ఎలా ట్రాక్ చేస్తాయో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచెస్ మన అడుగులు, మనం నడిచిన దూరం, కాలరీస్ ఖర్చు అన్నీ లెక్క చేస్తాయి. ఉదాహరణకి, మీరు రోజుకు 10,000 అడుగులు నడవాలనుకుంటే, వాచ్ మీకు గుర్తు చేస్తుంది. ఇలా మనం క్రమంగా కదలడం, నడక చేయడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం కూడా సక్రమంగా పనిచేస్తుందని తెలుపుతుంది.
రెండవది, స్మార్ట్ వాచ్‌లు హార్ట్ రేట్ (మన హృదయాన్ని) పర్యవేక్షిస్తాయని మీకు తెలుసా. చాలాసార్లు మనం గమనించకుండానే హృదయం కొద్దిగా వేగంగా లేదా ఆలస్యంగా కొట్టుకుంటుంది. కొత్త స్మార్ట్ వాచెస్ హార్ట్ రేట్ మానిటర్‌తో మన హృదయం ఎలా కొట్టుకుంటుందో, విశ్రాంతి సమయంలో ఎంత వేగంగా ఉంటుందో తెలుపుతుంది. అంతేకాదు వ్యాయామ సమయంలో ఎలా పనిచేస్తుందో అన్నీ చెక్ చేస్తాయి. కొన్నిసార్లు ఇవి అట్రియల్ ఫైబ్రిలేషన్ (A-fib) లాంటి సమస్యలను కూడా ముందుగానే గుర్తిస్తాయి. ఇలాంటి సమాచారం ఉన్నప్పుడు, డాక్టర్‌ను ముందే సంప్రదించడం ద్వారా సమస్యలు పెద్దగా మారకుండా చూడవచ్చు.
ఇంకా, నిద్ర గురించి మాట్లాడుకుందాం. మన శరీరానికి మంచి నిద్ర చాలా అవసరం. స్మార్ట్ వాచెస్ నిద్ర సమయంలో మనం ఎంత సేపు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామో, మధ్యలో ఎన్ని సార్లు లేచామో అన్నీ రికార్డు చేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మనం నిద్ర అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు, ఒత్తిడి మన ఆరోగ్యానికి పెద్ద సమస్య. కొన్ని స్మార్ట్ వాచెస్ హార్ట్ రేట్ వేరియబిలిటీ ద్వారా ఒత్తిడి స్థాయిని అంచనా వేస్తాయి. అలాగే, శ్వాశను పీల్చుకోవడం, ఎక్సర్సైజ్‌లు, రిలాక్స్ రిమైండర్లు కూడా ఉంటాయి. ఇవి మన మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
అలాగే, ఇవి చిన్న చిన్న ఆరోగ్య అలవాట్లకు మనకు ప్రేరణ ఇస్తాయి. ఉదాహరణకి, కొంతసేపు నిలిచివుండమని, కదలమని, నీళ్లు తాగమని రిమైండర్లు పంపుతాయి. వీటివల్ల మనం శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటుంది. కొత్త స్మార్ట్ వాచెస్ కాస్త అడ్వాన్స్‌గా ఉన్నాయి. ఇవి బ్లడ్ ఆక్సిజన్, ECG, హార్ట్ రేట్ లాంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి, డాక్టర్‌ను త్వరగా సంప్రదించడం సాధ్యమవుతుంది. ఇవి మనకు వ్యాయామం చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మొటివేషన్ కూడా ఇస్తాయి.
మనకు అందుబాటులో ఉన్న వ్రిస్ట్ వాచెస్ రకాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. ఫిట్‌నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచెస్, హైబ్రిడ్ వాచెస్, మెడికల్-గ్రేడ్ వాచెస్ ఇలా నాలుగు రకాలుంటాయి. ఫిట్‌నెస్ ట్రాకర్స్ సాధారణ ట్రాకింగ్ కోసం, స్మార్ట్ వాచెస్ అదనపు ఫీచర్స్ తో, హైబ్రిడ్ వాచెస్ క్లాసిక్ లుక్ తో, మెడికల్-గ్రేడ్ వాచెస్ స్పెషల్ ఆరోగ్య అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఇవాళ 2025 స్మార్ట్ వాచెస్ ఇంకా మెరుగైనవి. Apple Watch Series 9, Samsung Galaxy Watch 6, Garmin Fenix 7 లాంటి వాచెస్ ఖచ్చితమైన హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, ECG ట్రాకింగ్ ఇస్తాయి. కొన్నింటిలో స్ట్రెస్, మన నిద్రలో వచ్చే విభిన్న దశలు, బాడీ టెంపరేచర్ కూడా ట్రాక్ చేయవచ్చు. ఇవి మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
ఖచ్చితం అని చెప్పలేము..
ఇవి మెడికల్ డివైస్ కాదు కాబట్టి,స్మార్ట్ వాచ్ ద్వారా చూపే కాలరీ లెక్క 100% ఖచ్చితంగా ఉండకపోవచ్చు, నిద్రలో వచ్చే విభిన్న దశలు కొంచెం తప్పు కావచ్చు. పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్, మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, హార్ట్ రేట్ అన్నీ ట్రాక్ చేయడానికి నిజంగా సహాయపడుతుంది. మీరు సులభమైన ట్రాకింగ్ కోసం Fitbit లేదా Amazfit వాచ్ ఎంచుకోవచ్చు. మరింత అడ్వాన్స్ ఫీచర్స్ కోసం Apple Watch, Samsung Galaxy Watch, BP Doctor Pro 17 వంటి వాచెస్ బాగుంటాయి.