Abrar Ahmed – Sanju Samson: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిన నేపథ్యలో.. పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ కు టీమిండియా ప్లేయర్లు ఇచ్చిపడేశారు. సంజూ శాంసన్ వికెట్ తీసి… ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అబ్రార్ అహ్మద్. తల అటు ఇటు ఊపుతూ….బీహేవ్ చేశాడు. అయితే.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. ఛాంపియన్ అయిన తర్వాత… అబ్రార్ అహ్మద్ కు కౌంటర్ ఇచ్చారు. అచ్చం అబ్రార్ అహ్మద్ చేసినట్లుగానే ఇమిటేట్ చేశారు టీమిండియా ప్లేయర్లు. ఇక ఈ సన్నివేశంలో అక్కడే ఉన్న సంజూ శాంసన్… పగలపడి నవ్వాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.
పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ మంచి ఎంటర్ టైనర్ అన్న సంగతి తెలిసిందే. వికెట్ తీసిన ప్రతీసారి… ఏదో ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చి.. అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ తరుణంలోనే… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో సంజూ శాంసన్ మంచి ఊపులో ఉండగా.. అతన్ని పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇక వికెట్ తీసిన సంతోషంలో… తల అటు ఇటు ఊపుతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్. అయితే..ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న టీమిండియా ప్లేయర్లు జితేష్ శర్మ, అర్ష్ దీప్ సింగ్, హర్శిత్ రాణా… అబ్రార్ అహ్మద్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. అచ్చం అతని లాగే… సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సంజూ శాంసన్ ను ముందు నిలబెట్టి… తల అటు ఇటు ఊపుతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు టీమిండియా ప్లేయర్లు జితేష్ శర్మ, అర్ష్ దీప్ సింగ్, హర్శిత్ రాణా. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు… సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రానించడంతో టీమ్ ఇండియా గ్రాండ్… విక్టరీ కొట్టింది. 20 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు తిలక్ వర్మ. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీ కూడా అందుకోలేదు టీమిండియా. పాకిస్తాన్ అధికారి నఖ్వి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అందుకోవడం ఇష్టం లేక… టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకోలేదు. ఆ ట్రోఫీని తీసుకోకుండా…. కచ్చితంగా ఇండియాకు ఆ ట్రోఫీని పంపించాల్సి ఉంటుంది. పంపించపోతే.. తమ సత్తా ఏంటో చూపిస్తామని ఇప్పటికే బీసీసీఐ అధికారి సైకియా వార్నింగ్ ఇచ్చాడు.
ARSHDEEP SINGH & TILAK VARMA'S EPIC REPLY TO ABRAR'S CELEBRATION AFTER DISMISSING SANJU SAMSON! 💥
THESE NEW KIDS ARE ALWAYS READY FOR PAYBACK! 😛🔥🔥#AsiaCup2025 #AsiaCupT20 #INDvPAK #IndiaVsPakistan #TilakVarma #PAKvIND pic.twitter.com/2TamYSp1wZ
— Harinder Singh Brar (@Harinderbrar708) September 28, 2025