BigTV English

Bigg Boss 9: 3వారాలకు గానూ కామనర్ ప్రియాశెట్టి ఎంత రెమ్యూనరేషన్ పొందిందంటే?

Bigg Boss 9: 3వారాలకు గానూ కామనర్ ప్రియాశెట్టి ఎంత రెమ్యూనరేషన్ పొందిందంటే?

Bigg Boss 9: బిగ్ బాస్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 6 మంది ఈసారి కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు.. వాస్తవానికి వీరిని సెలెక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 45 మంది తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో ఎంపికైన 6 మందిని హౌస్ లోకి పంపించగా.. ఇప్పటికే కామనర్స్ నుండి మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వగా.. నిన్న మూడవ వారానికి సంబంధించి మరో కామనర్ ప్రియా శెట్టి (Priya Shetty) కూడా ఎలిమినేట్ అయ్యారు. మరి హౌస్ లో తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటి? ఆమె మూడు వారాలకు గానూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు వీరే..

బిగ్ బాస్ తెలుగు 9 తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. రెండవ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వగా.. ఇక మూడవ వారం జరిగిన నామినేషన్ లో పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి , హరీష్, రీతు చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్ నామినేట్ అయ్యారు.

ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి కారణం?


ప్రియా శెట్టి కి కేవలం 11.05% మాత్రమే ఓటింగ్ పోల్ అయింది. దీనికి తోడు శ్రీజ తో కలిసి నోరు వేసుకొని అరవడం తప్పించి, ఈమె పెద్దగా ప్రభావం చూపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరించేదని.. నువ్వు చెబితే నేను వినేదేంటి అనే రేంజ్ లో ప్రియా శెట్టి వ్యవహరించింది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఈమె తీరు ఎవరికీ నచ్చక మూడవ వారమే ఎలిమినేట్ చేసి పంపించేయడం జరిగింది.

3వారాలకు గాను ప్రియా శెట్టి రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన 6 మంది కామనర్స్ కి ఒక్కొక్కరికి 70, 000 చొప్పున వారానికి ఇస్తున్న విషయం తెలిసిందే. అలా రెండు వారాలకు ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ రూ.1,40,000 తీసుకోగా.. ఇప్పుడు మూడు వారాలపాటు హౌస్ లో కొనసాగిన ప్రియా శెట్టి రూ.2,10,000 రెమ్యూనరేషన్ పట్టుకెళ్ళినట్లు సమాచారం. మొత్తానికైతే హౌస్ లోకి ఎన్నో కలలతో అడుగుపెట్టి.. బిగ్ బాస్ హౌస్ లోకి రావడమే లక్ష్యంగా వచ్చిన ఈమె అనూహ్యంగా మూడు వారాలకి ఎలిమినేట్ అవ్వడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సరికొత్త టాస్క్ లతో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 9..

ప్రస్తుతం సరికొత్త టాస్కులతో బిగ్ బాస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈసారి 9వ సీజన్ మాత్రం చాలా అనూహ్యంగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా ఈ సీజన్ మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related News

Bigg Boss Buzzz : ప్రియా శెట్టిని కడిగిపడేసిన శివాజీ, నోరు తెరవనివ్వకుండా కౌంటర్లు

Bigg Boss 9 : ట్విస్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ తో కలర్ ఫుల్ దసరా ఎపిసోడ్

Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?

Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

Bigg Boss 9 : ఫ్యూజ్ లు ఎగిరిపోయే వార్నింగ్ లు, సరికొత్త టాస్కులు, మరికొన్ని ట్విస్టులు 

Bigg Boss 9: కంటెస్టెంట్స్ కి రియల్ అగ్ని పరీక్ష.. సంజన కోసం ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. తనూజ కాఫీ.. త్యాగం

Big Stories

×