BigTV English
Advertisement

Smart Watch : స్మార్ట్ వాచ్ వాడుతున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే!

Smart Watch : స్మార్ట్ వాచ్ వాడుతున్నారా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే!

Smart Watch : టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో స్మార్ట్ గాడ్జెట్స్ వినియోగం సైతం అదే స్థాయిలో పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ వాచెస్ అంటూ డిజిటల్ డివైసెస్ ఎన్నో వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ కు ఉన్న క్రేజే వేరు. ఇందులో హెల్త్ ఫిట్నెస్ ట్రాకింగ్ తో వచ్చేసిన అడ్వాన్స్డ్ స్మార్ట్ వాచెస్ తో యూత్ మెస్మరైజ్ అవుతున్నారు. ఇందులో ఎంత ఖరీదైన వాచెస్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే హెల్త్ ట్రాకింగ్ బెనిఫిట్స్ తో హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ స్మార్ట్ వాచెస్ వెనుక పెద్ద రిస్క్ ఉందండోయ్. తాజాగా జరిగిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలను బయట పెట్టేసింది.


స్మార్ట్ వాచెస్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ ఫిట్నెస్ ట్రాకింగ్, వాట్సాప్ కాలింగ్, ఫీచర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అంటూ ఎన్నో అధునాతన సదుపాయాలను అందించేస్తుంది. ఇక నిత్యం ఉపయోగించే విధంగా ఈ వాచెస్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఎంతో ఖరీదైన స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థలు ఆపిల్, సాంసంగ్, వన్ ప్లస్ వంటివి బెస్ట్ ఫీచర్స్ తో స్మార్ట్ వాచెస్ ను తీసుకొచ్చేసాయి. వీటికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ స్మార్ట్ వాచెస్ ఎక్కువగా వాడితే మాత్రం క్యాన్సర్ వస్తుందంటూ తాజాగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ తన అధ్యయనంలో తెలిపి పెద్ద షాక్ ఇచ్చింది.

అసలు స్మార్ట్ వాచెస్ వాడితే క్యాన్సర్ ఎందుకొస్తుంది? దీని వెనక ఏం జరుగుతుంది? నిజాలు ఏంటి? అంటే నిజానికి నాన్ స్టిక్ కుక్ వేర్, ఫ్యాబ్రిక్స్, కాస్మోటిక్స్ వంటి వాటిలో వాడే పాలీఫ్లోరోఆల్కైల్ సబ్‌స్టెన్సెస్(PFAS) ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తూ ఉంటాయి. ఇవి వాతావరణంలో అసలు కరగవు. వీటిని ఫరెవర్ కెమికల్స్ అంటారు. ఇప్పుడు వీటిని స్మార్ట్ వాచెస్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ వాచెస్ కు వాడే స్ట్రాప్స్ రంగు కోల్పోకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని చేతికి పెట్టుకున్నప్పుడు విడుదల ఆయిల్ ఈ స్మార్ట్ వాచెస్ రంగుని కోల్పోయేలా చేస్తున్నాయి. అందుకే ఫరెవర్ కెమికల్స్ ను ఉపయోగించి వాటి బ్రాండ్ దెబ్బతినకుండా చేస్తున్నారు. దీంతో హెల్త్ రిస్కు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.


ఇది శరీరంలోకి వెళ్తే దీర్ఘకాలికంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఫెర్టిలిటీ సమస్యలు సైతం వస్తాయి. ముఖ్యంగా  ప్రొస్టేట్, టెస్టిక్యులర్, కిడ్నీ క్యాన్సర్‌ సమస్యల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అందులో ఖరీదైన బ్రాండ్ స్మార్ట్ వాచెస్ తో ఇంకా ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ఫరెవర్ కెమికల్స్ ఎక్కువగా ఉపయోగించడంతో 22 బ్రాండ్స్ స్మార్ట్ వాచెస్ లో 15 బ్రాండ్లలో ఈ కెమికల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇక ఇందులో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. సో ఇదండీ మీరు కూడా ఎక్కువగా స్మార్ట్ వాచెస్ వాడుతుంటే ఇకనైనా అప్రమత్తం అవ్వండి.

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×