BigTV English
Advertisement

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : రష్మిక మందన్న తన కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ గా యమ క్రేజ్ పెరిగింది. ఆమె ఇప్పుడు తన కొత్త చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మరో సారి విజయ తీరాలను తాకడానికి సిద్ధంగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2025 నవంబర్ 7 న థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పవర్ ఫుల్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసే ముందు, రష్మిక నటించిన హిట్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం పదండి.


1. కిరిక్ పార్టీ

2016లో విడుదలైన కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక మందన్న కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్ర పోషించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో రష్మిక సాన్వి పాత్రను పోషించింది. ఆమె నటనకు విమర్శకులతో పాటు, ప్రేక్షకులు కూడా ప్రశంసించారు. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

2. గీత గోవిందం

గీత గోవిందం రష్మిక కెరీర్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆమె కెరీర్‌లో తొలిసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. వీళ్ళ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. కామెడీతో కూడిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక గీత పాత్రను పోషించింది. ఈ చిత్రం విజయం తర్వాత ఆమె కెరీర్ కొత్త మలుపు తిరిగింది. జీ 5, జియో హాట్ స్టార్ లో ఈ సినిమాని చూడచ్చు.


3. డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్ సినిమా రష్మిక మందన్నలో అసలు నటి ప్రపంచానికి చూపించింది. ఆమె తన కోచ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన లిల్లీ అనే మహిళా క్రికెటర్ పాత్రను పోషించింది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక నటన హైలెట్ గా నిలిచింది. మరోసారి విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

4. భీష్మ

వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన్న నటించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ’. ఈ కామెడీ రొమాంటిక్ డ్రామాలో నితిన్ ప్రధాన పాత్రలో నటించారు. రష్మిక, నితిన్ మధ్య మాటలు, సూపర్ హిట్ పాటలు, ఒక గ్రిప్పింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నితిన్ ప్రేమలో పడే ఒక పోలీస్ కూతురు చైత్ర పాత్రలో రష్మిక కనిపించింది. యూట్యూబ్ లో ఈ సినిమాని ఫ్రీగానే చూడొచ్చు.

5. సీతా రామం

తన కెరీర్‌లో తొలిసారిగా, రష్మిక మందన్న ఒక తెలుగు సినిమాలో క్యారెక్టర్ రోల్ పోషించింది. ఇద్దరు ప్రేమికులను తిరిగి కలిపే హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ అఫ్రీన్ పాత్రలో రష్మిక కనిపించింది. హను రాఘవపూడి తీసిన ఈ చిత్రంలో ఆమె నిజాయితీ నటనకు గొప్ప ప్రశంసలు లభించాయి.ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

6. పుష్ప

ఇక పుష్ప సినిమాతో ఈ అందాల భామ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్‌, 2024లో పుష్ప 2: ది రూల్ లో సిరివల్లి పాత్రలో రష్మిక జీవించిందనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని చూడవచ్చు.

7. యానిమల్

పుష్ప క్రేజ్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడికి, ఈ సినిమా మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం తో పాటు ఎడిటర్గా కూడా వ్యవహారించారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

 

Related News

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×