Trolls on Anchor Anasuya: నటి, యాంకర్ అనసూయ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెపై భగ్గమంటున్నారు. ఆమె నటిస్తున్న తమిళ చిత్రం ఊల్ఫ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ విడుదలైనప్పటి నుంచి అనసూయపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కారణం గతంలో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో పాట రిజెక్ట్ చేయడమే. కాగా అనసూయ జబర్దస్త్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. యాంకర్గా తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్తో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. హాట్ యాంకర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అదే టైంలో అనసూయకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల అత్తారింటికి దారేదిలో సినిమాలో ఆఫర్ వచ్చింది. ఇందులోని ‘ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే‘ స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది. హంస నందిని, నటి ముంతాజ్లు తమదైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. వారితో పాటు ఒకరిని అనసూయకు కూడా ఆఫర్ వచ్చింది. కానీ, ఆమె చేయనని రిజెక్ట్. అప్పట్లో ఈ వ్యవహరం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అప్కమ్మింగ్ నటీనటులకు ఊహించని ఆఫర్. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా చిన్న పాత్రయినా చేయాలనేది నటీనటులు కోరిక.
అలాంటి యాంకర్కి స్టార్ హీరోతో కలిసి స్టెప్పులేసే అవకాశం వస్తే.. చేయనని చెప్పడేమంటని ఆమెపై ట్రోల్ చేశారు. అత తలపోగరు పనికారాదంటూ అనసూయను దెబ్బిపోడిచారు. దీనికి స్పందించిన ఆమె అత్తారింటికి దారేది పాటలో నటిస్తే.. గుంపులో గొవింద అన్నట్టుగా ఉండేది.. నాకంటూ గుర్తింపు రాదనే రిజెక్ట్ చేసినట్టు చెప్పింది. కెరీర్ ప్రారంభంలోనే పెద్ద ఆఫర్ తిరస్కరించిన అనసూయ.. తాజాగా ఊల్ఫ్ మూవీలో ప్రభుదేవతో చేసిన ఐటెం సాంగ్ విడుదల చేశారు. ఇందులో రాయ్ లక్ష్మి, మరో గ్లామర్ నటితో పాటు అనసూయ కూడా కనిపించింది. ఇందులో ప్రభుదేవతో అనసూయ బోల్డ్ స్టెప్పులేసింది.
Also Read: Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ రిలీజ్.. ప్రభుదేవతో రొమాన్స్!
అయితే ఈ పాటలో అనసూయ బోల్డ్గా కనిపించడంతో ఆమెపై తెలుగు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో అత్తారింటికి దారేది లాంటి బిగ్ ఆఫర్లో ఫేం రాదంటూ ఆంక్షలు పెట్టుకున్న నువ్వు.. ఇప్పుడు నటిగా గుర్తింపు వచ్చినప్పటికీ ఇలాంటి ఐటెం సాంగ్ చేసేందుకు మాత్రం ఎలాంటి ఆంక్షల అడ్డురాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. భాష మారితే ఏలాంటి పాత్రైనా చేస్తావా? తెలుగు సినిమాకు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇవ్వలేదంటూ అనసూయపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ పుల్ రోల్లో నటిచిందా? లేక కేవలం ఐటెం సాంగ్లో నటించిందా అనేది క్లారిటీ లేదు. కానీ, ఈ ఊల్ఫ్ మూవీ తర్వాత అనసూయ తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. మరి దీనిపై ఈ అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.