E-Paper
Advertisement

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Rana Daggubati: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman), భాగ్యశ్రీ(Bhagya Shree) ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం కాంత(Kaantha) .1950 టైంలో మద్రాస్ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఒక హీరో గురువుతో సమానమైన ఒక డైరెక్టర్ మధ్య వివాదాల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా నేడు ఉదయం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

మత్తులో మాట్లాడలేదు రా..

ఇలా ఉదయం ట్రైలర్ విడుదల కావడంతో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రానా(Rana) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత రానా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ గోల చేశారు. అలాగే కొంతమంది అభిమానులు తాగి మాట్లాడుతున్నావా అన్న అంటూ గట్టిగా అరవడంతో రేయ్.. మద్యం మధ్యలో మాట్లాడలేదు రా ఏదో చిన్నప్పటి విషయాలన్నీ మీతో పంచుకుందామని ప్రిపేర్ అయి వచ్చాను.. నన్ను మాట్లాడనివ్వండి అంటూ రానా అభిమానులను వేడుకున్నారు.

పిరియాడిక్ సినిమా అంటేనే దుల్కర్..

ఇక రానా చిన్నతనంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే స్టూడియోలు నిర్మాణం జరుగుతుందని అప్పుడు మీడియా లేకపోవడంతో ఫలానా స్టూడియోలో ఇది జరిగింది, అది జరిగింది అంటూ మాట్లాడుకునేవారు అలాంటి నేపథ్యంలోనే కాంత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు. అయితే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చిన హీరో దుల్కర్ సల్మాన్ అని తెలిపారు.ఏదైనా పిరియాడిక్ సినిమాలలో నటించాలి అంటే అందుకు దుల్కర్ కచ్చితంగా సరిపోతారని రానా హీరో పై ప్రశంసల కురిపించారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎంతో అద్భుతంగా నటించారని ఈ సినిమా తర్వాత ఆయనను నట చక్రవర్తి అనే బిరుదుతో పిలుస్తారని రానా సినిమా గురించి మాట్లాడుతూ భారీగా హైప్ పెంచారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సెల్వ రాజు దర్శకత్వం వహించగా, స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఝును సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దుల్కర్ నటించిన ఈ చిత్రం నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Chikiri – Chikiri song: పెద్ది చికిరి.. చికిరికి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ వైరల్!

Related News

చిరంజీవి ‘మెగా158’ ప్రాజెక్ట్‌లోకి థమన్ ఎంట్రీ.. ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌ ఎవరంటే?

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా!.. కారణం ఏంటంటే?

బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

సమాజ సేవలో యువ నటుడు సంజోష్.. స్కాలర్‌షిప్స్ పంపిణీ!

‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్!’.. ఎన్టీఆర్‌పై అల్లు అర్జున్ క్రేజీ ట్వీట్..

టాలీవుడ్ ‘రాక్ స్టార్’ మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. నెపోటిజం నుంచి బయటకు వచ్చి..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన డైరెక్టర్ .. మళ్ళీ అదే ఫార్మాట్ లో గ్లింప్స్..

తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!

Big Stories

×