Chikiri – Chikiri song: రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi). రామ్ చరణ్, జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ” చికిరి చికిరి” (Chikiri Chikiri)అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇక ఈ ప్రోమోలో రాంచరణ్ హుక్ స్టెప్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పాటకు ఏ స్థాయిలో ఆదరణ లభించిందో స్పష్టమవుతుంది. ఇలా ప్రోమోనే ఈ స్థాయిలో హైప్ పెంచేస్తే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో అనే ఆత్రుత అభిమానులలో నెలకొంది. అయితే తాజాగా ఈ ఫుల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. చికిరి – చికిరి అంటూ సాగిపోయే ఈ పాట రేపు(నవంబర్ 7) ఉదయం 11:07 గంటలకు విడుదల కాబోతోందని మేకర్స్ అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ కూడా రామ్ చరణ్ స్టైలిష్ స్టెప్ కు సంబంధించిన లుక్ కావడంతో పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కానీ గ్లింప్ వీడియోకాని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు.
క్రికెట్ కామెంటేటర్..
ఇక ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఈమె కూడా అచ్చియమ్మా పాత్రలో కనిపించబోతున్నట్టు ఇటీవల మేకర్స్ జాన్వీకి సంబంధించిన పోస్టులు విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ క్రికెట్ కామెంటేటర్ గా కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇదివరకే దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ మరోసారి పెద్ద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా 2026 మార్చి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు..RRR తరువాత రామ్ చరణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో అభిమానుల ఆశలన్నీ కూడా పెద్ది సినిమా పైన ఉన్నాయి.
Also Read: Rahul Ravindran: మన్మథుడు 2 ప్లాప్.. నాగార్జున ఫోన్ చేసి అంత మాట అన్నారా?