Bihar election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. చెదురు ముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగినట్లు అధికారులు తెలిపారు.
సాయంత్రం 5 గంటల సమయానికి 60.13% శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే, పోలింగ్ సమయం ముగిసినా పలు కేంద్రాల వద్ద ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. దీంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.