BigTV English

Turkey:- అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఆ దేశ శాటిలైట్..

Turkey:- అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ఆ దేశ శాటిలైట్..

Turkey:- స్పేస్ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుండడంతో చిన్న దేశాలు సైతం అంతరిక్షంపై ప్రయోగాలు చేయాలని, శాటిలైట్లు తయారు చేయాలని ఆశతో ఉన్నాయి. అభివృద్ధి చెందని దేశాలు కూడా తమకు ఉన్న వనరులతోనే శాటిలైట్ల తయారీని చేపడుతున్నాయి. తాజాగా అలాంటి ఒక దేశమే తమ మొట్టమొదటి శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు గర్వంగా ప్రకటించారు.


టర్కీకి చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ టర్కీ (ట్యూబిటాక్) తాజాగా భూమిని గమనించే 700 కేజీల హై రెజల్యూషన్ శాటిలైట్‌ను గాలిలోకి పంపింది. దాదాపు 200 మంది అయిదేళ్లుగా ఈ శాటిలైట్ తయారీ కోసం కష్టపడ్డారు. ఈ ఐఎమ్మీసీఈ శాటిలైట్‌ క్యాలిఫోర్నియాలోని స్పేస్ స్టేషన్ నుండి గాలిలోకి ఎగిరింది. అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా శాటిలైట్ లాంచ్ చాలాసార్లు వాయిదా పడింది.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కాన్ 9 అనే రాకెట్ నుండి ఈ శాటిలైట్ అంతరిక్షానికి చేరుకుంది. ఈ శాటిలైట్ తయారీ కోసం కష్టపడిన సైంటిస్టులు, ఇంజనీర్లు, టెక్నిషియన్లు అందరూ టర్కీకి చెందిన వారే అని ఆ దేశ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరా నుండి సోలార్ ప్యానెల్ వరకు దాదాపు 90 శాతం సాఫ్ట్‌వేర్ కూడా ఆ దేశంలో తయారు చేసిందే అని తెలిపింది. ప్రస్తుతం టర్కీకి స్పేస్ పరంగా ఏ సమాచారం కావాలన్నీ ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఐఎమ్మీసీ వల్ల ఆ లోటు తీరిపోతుందని భావిస్తోంది.


ఐఎమ్మీసీ అనేది ప్రకృతి వైపరీత్యాలను కనుక్కోవడానికి, బోర్డర్లను గుర్తించడానికి, మ్యాపింగ్, వ్యవసాయ రంగాల్లో సహాయపడడానికి ఉపయోగపడుతుందని టర్కీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి 680 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్ ప్రయాణిస్తుందని వారు అన్నారు. దానికి ఫిక్స్ చేసిన కెమెరాలు 16 చదరపు కిలోమీటర్ల వరకు దూరాన్ని ఒకే ఇమేజ్‌లో కవర్ చేయగలవని తెలిపారు. దీని ద్వారా శాటిలైట్ మార్కెట్లోకి మేము కూడా అడుగుపెట్టగలమని, ఏదైనా సాధించగలమని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నామని టర్కీ శాస్త్రవేత్తలు గర్వంగా ప్రకటించారు.

Tags

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×